టాలీవుడ్ రౌడీ గా ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ గత కొన్ని కాలంగా వరుస ఫ్లాప్ లతో క్రేజ్ తగ్గొఇన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో ఎంత ఎగ్రెస్సివ్ గా ఉన్నా.. సక్సెస్ లు దక్కకపోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో డైలమాలో పడిపోయాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా రిజల్ట్ నిర్మాతలకు పెద్ద షాక్ ఇచ్చిందన్న  టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న నిర్మాతకు ఈ సినిమా మరో పెద్ద దెబ్బ కొట్టిందన్న చర్చ సాగుతోంది. అంతకుముందు తీసిన సినిమాలు కూడా ఆడకపోవడంతో క్రియోటివ్ కమర్షియల్స్ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయిందన్న ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో సాగుతోంది.

 

ఇక లవ్ స్టోరీల్లో నటించను అని విజయ్ దేవరకొండ ఏ ఉద్ధేశంతో అన్నాడో తెలీదు కానీ.. వరల్డ్ ఫేమస్ లవర్ రిజల్ట్ కూడా ఆ మాటకే కట్టుబడి ఉండాలని విజయ్ కి సూచిస్తున్నట్టు అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు రూట్ మార్చి పూరి స్టైల్లో పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ కి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు. విజయ్ ఆశలన్నీ ఇప్పుడు పూరీ తీసే సినిమా మీదే పెట్టుకున్నాడు. అందుకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ చాలానే కష్టపడుతున్నాడు. జిమ్ ల చుట్టూ తిరిగి.. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని పూర్తి ఫిట్ నెస్ తో కనిపించడానికి బాగా శ్రమిస్తున్నాడు. 

 

గీత గోవిందం సినిమా తరవాత మళ్ళీ అలాంటి హిట్ లేక దేవర కొండ మార్కెట్ బాగా డీలా పడింది. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ పూరి 'ఫైటర్' సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఇస్మార్ట్ వంటి హిట్ ని పూరి విజయ్ కి కూడా ఇస్తాడన్న నమ్మకంతో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ 6 ప్యాక్ తో సర్ ప్రైజ్ ట్రీట్ ఇస్తాడని సమాచారం. ఇక ఫైటర్ లో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తోంది. ఏదేమైనా పూరి విజయ్ ని పీల్చి పిప్పి చేస్తున్నాడుగా .. సిక్స్ ప్యాక్ కాదు అంతకు మించి .. అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: