మొదటి సినిమా తుస్సుమన్న కూడా రెండవ సినిమా ఆర్.ఎక్స్ 100 తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుని కెరీర్ ని బాగా స్టార్ట్ చేశాడు కార్తికేయ. వాస్తవంగా ఆర్.ఎక్స్ 100 సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు... ఊహించలేదు. కాని రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గ్లామర్ కావచ్చు డైరెక్టర్ అజయ్ భూపతి మేకింగ్ కావచ్చు సినిమా పెద్ద హిట్ అయింది. ఇండస్ట్రీలో చాలా మంది ఆర్.ఎక్స్ 100 సినిమా గురించే మాట్లాడుకున్నారు. అంతగా ఇంపాక్ట్ చూపించింది ఆర్.ఎక్స్ 100 సినిమా. ఈ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ ఇప్పటి వరకు మళ్ళీ అడ్రస్ లేడు కాని.. హీరో కార్తికేయకి, హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కి మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. 

 

కానీ ఇద్దరు నిలదొక్కులేకపోయారు. ముఖ్యంగా ఆర్.ఎక్స్ 100 తర్వాత వచ్చిన రెండు సినిమాలు దారుణంగా ఫ్లాపయ్యాయి. అటు పాయల్ పరిస్థితి అంతే. అయితే అనూహ్యంగా కార్తికేయ  జీఏ 2లో అవకాశం దక్కించుకున్నాడు. 'చావు కబురు చల్లగా. అనే టైటిల్ పోస్టర్ సహా కార్తికేయ పోస్టర్లను రివీల్ చేసారు. ఈ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాని బన్ని వాసు చాలా లిమిటెడ్ బడ్జట్ లో నిర్మిస్తున్నారట. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా నటిస్తోంది.

 

అయితే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. 'చావు కబురు చల్లగా'.. కథ మరో ఆర్.ఎక్స్ 100 రేంజులో స్పైసీగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో కార్తికేయ రోల్ రగ్గ్ డ్ గా, చాలా దూకుడుగా ఉంటుందట. అయితే వాస్తవంగా ఈ సినిమా కథ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లిందట. ఆ హీరోలల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోలు కూడా ఉన్నారట. అయితే వాళ్ళెవరైకి ఈ కథ నచ్చలేదట. దాంతో చివరకు కార్తికేయ దగ్గరకు వచ్చిందని... కార్తికేయ ఒకే అన్నాక బన్ని వాసు కాన్ఫిడెంట్ గా సెట్స్ కి వెళ్లారని తెలుస్తోంది. జీఏ2 బ్యానర్ తెరకెక్కించిన 100 పర్సంట్ లవ్- గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్లతో చైతన్య ..విజయ్ దేవరకొండ లాంటి హీరోల స్టేటస్ కంప్లీట్ గా మారిన సంగతి తెలిసిందే. మరి 'చావు కబురు చల్లగా' కార్తికేయకి హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: