టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి పేరు ఉంది. ప్రస్థానం సినిమా నుండి శర్వా ప్రస్థానం చూస్తే తన లోని టాలెంట్ అండ్ స్టామినా ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. ఒక మూస ధోరణి లో వెళ్ళకుండా ఇప్పటి వరకు చేసిన సినిమాలన్ని ఎంతో వైవిధ్యభరితమైన సినిమాలే. వాటిలో చాలా సినిమాలు శర్వా కి నటుడిగా మంచి పేరు తెచ్చాయి. కెరీర్ ఆరంభంలో శంకర్ దాదా ఎం.ఎం.బి.ఎస్, సంక్రాంతి వంటి సినిమాలలో సైడ్ రోల్ నటిస్తూ నెమ్మదిగా సోలో హీరోగా ఎదిగాడు. నిజంగా ఇలా ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్ఠం అని చెప్పాలి. అయితే 'శతమానం భవతి' తర్వాత శర్వానంద్ కి అస్సలు కలిసి రావడం లేదు. 

 

వరుసగా ఫ్లాపులు వచ్చి పడుతున్నాయి. 'రాధా''పడి పడి లేచె మనసు''రణరంగం' ఇలా వరుసగా మూడు ఫ్లాపులొచ్చాయి. ఫ్లాప్స్ అనడం కంటే భారీ డిజాస్టర్ అని చెప్పాలి. దీంతో శర్వా మార్కెట్ బాగా పడిపోయింది. ఒక గట్టి హిట్ పడితేనే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. లేదంటే ఇక శర్వానంద్ ని మర్చిపోవాల్సిందే. ఇక తాజాగా వచ్చిన 'జాను' మీద ఆశలు పెట్టుకున్నాడు శర్వానంద్. కానీ రిలీజ్ రోజు మంచి టాక్ వచ్చినా పాజిటీవ్ రివ్యూలు పడినా సినిమా మ్యాట్నీ నుండే బాగా డ్రాప్ అయింది. ఆ దెబ్బ దెబ్బ మళ్ళీ సినిమా పైకి లేచే ఛాన్స్ లేకుండా పోయింది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికి సినిమా దారుణంగా పరాజయ్యాని చూసింది. ఈ దెబ్బ శర్వానంద్ కి కోలుకోలేని దెబ్బ అని ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు.

 

ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో ముందుగా 'శ్రీకారం' అనే సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది. కానీ మిగతా సినిమాల అప్‌డేట్స్ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ సినిమా రిజల్ట్ గనక తేడా కొడితే ఆ సినిమాల పరిస్థితేంటనేది క్లారిటీ వస్తుంది అంటూ మరొక న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే అసలు జనాలకి ఏం కావాలి.. ఎలాంటి సినిమా చేసిన నచ్చడం లేదు నాకు మెంటలెక్కుతుందని అంటున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: