టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలన్ని డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఏ కాంత్రి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద ప్రేక్షకులకి మంచి అంచనాలే నెలకొన్నాయి. అందుకు కారణం మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు వంటి బ్యూటి ఫుల్ లవ్ స్టోరీతో సినిమాని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా, హీరో విజయ్ దేవరకొండ అనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కూడా దారుణమైన పరాజయాన్ని మూట గట్టుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ కి విపరీతంగా మండిపోతోంది. 

 

వాస్తవంగా విజయ్ కి యూత్ లో అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ రెండు సినిమాలతో విజయ్ స్టామినా వామ్మో అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ అవాక్కయ్యొలా చేశాడు. అంతేకాదు బాలీవుడ్ లోను విపరీతంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయనప్పటికి తన తో సినిమా చేయాలని చాలామంది బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ ఎదురు చూస్తున్నారు.

 

అయితే గీత గోవిందం సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్ని వరుసగా ఫ్లాపవుతున్నాయి. డియర్ కామ్రేడ్ ఘోరంగా విజయ్ మార్కెట్ ని, పాపులారిటీని దెబ్బతీసింది. నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలతో విజయ్ మీద ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.అది వరల్డ్ ఫేమస్ లవర్ తో తగ్గిస్తాడనుకుంటే సీన్ రివర్స్ అయింది. విజయ్ దేవరకొండ మీద ఫ్యాన్స్ బాగా ఫ్రస్టేట్ అవుతున్నారట. ఆయన సినిమాలన్ని గుర్తు చేసుకొని వాటిలో ఫ్లాప్ సినిమాలని తలుచుకొని మరీ తిట్టుకుంటున్నారట.

 

ఇక రీసెంట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాని ఛీ ఛీ ఇది వరస్ట్ లవర్ ఇది సినిమానా .. మాకు నీ మీద వస్తున్న ఫ్రస్టేషన్ కి పళ్ళు బిగించి పెదాలు కొరుక్కున్న కోపం తగ్గట్లేదు. రక్తాలు కారుతున్నా నీద మంట చల్లారడం లేదని ఫ్యాన్స్ రగిలిపోతున్నారట. అర్జెంట్ గా విజయ్ ఒక హిట్టివ్వకపోతే ఇక అంతే. 

మరింత సమాచారం తెలుసుకోండి: