సినిమాల్లో పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. రాజకీయాల్లో కూడా అదే క్రేజ్ ఉన్న పవన్ కు పరిస్థితులు కలిసిరాలేదు. ఇందుకు రాజకీయంగా పవన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు కారణమయ్యాయి. పవన్ రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి. పవన్ ఈమధ్య బీజేపీతో పెట్టుకున్న పొత్తుపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ నిర్ణయాలు తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చాడు.

 

 

‘పవన్ నిర్ణయాలు నాకు విస్మయం కలిగిస్తున్నాయి. పవన్ బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో నాకు అర్ధం కాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీని తిట్టిన తిట్లు ఇప్పడేమయ్యాయి. ప్రధాని మోదీ మ్యాన్ ఆఫ్ ది మిలీనియమ్ అంటున్న పవన్ కు ఆయన ఎందుకు అలా అనిపించాడో ఆయనకే తెలియాలి. ఏపీ రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు. కానీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు. ఇటీవల నేను విశాఖకు వెళ్లాను. విశాఖకు రాజధాని రావడం పట్ల అక్కడెవరూ సంతృప్తి వ్యక్తం చేయలేదు. మంచో చెడో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటే బాగుండేది’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.

 

 

బీజేపీ అంటే ప్రకాశ్ రాజ్ కు పడని సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పనితీరును మెచ్చుకున్నాడు. కానీ.. ఏపీ పాలిటిక్స్ పై మాత్రం నెగటివ్ గా స్పందించాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తీరును తప్పుబట్టాడు. ఇటివల మీడియా ఇంటరాక్షన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరి జగన్ అభిమానుల నుంచి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసైనికుల నుంచి ఎటువంటి విమర్శలు ఎదుర్కొంటాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: