తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పటివరకు వచ్చిన అనేకమంది కమెడియన్లలో దాదాపుగా అందరూ ఎంతో మంచి పేరు దక్కించుకున్నప్పటికీ, వారిలో ఇంకొందరు మాత్రం తమ చెరగని హాస్యపు జల్లులు మన ప్రేక్షకుల మదిలో ముద్రించారు. ఇక ఆ విధంగా మన తెలుగు ప్రేక్షకులను ఎన్నో ఏళ్ల పాటు తన నవ్వులతో గిలిగింతలు పెట్టిన హాస్యనటుల్లో ఒకరు బాబూమోహన్. తొలి సినిమా ఈ ప్రశ్నకు బదులేది తో తెరంగేట్రం చేసిన బాబూమోహన్, ఆపై1987లో ఆహుతి సినిమాతో కమెడియన్ గా మంచి మార్కులు వేయించుకున్నారు. 

 

ఆ తరువాత అంకుశం, బాలచంద్రుడు, బొబ్బిలి రాజా, ఇద్దరూ ఇద్దరే, కర్తవ్యం, ఆదిత్య 369 తదితర సినిమాలతో వరుసగా తన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి పేరు దక్కించుకున్న బాబుమోహన్, ఆపై మరింతగా అవకాశాలతో దూసుకెళ్లారు. ఆ విధంగా ఎన్నో వందల సినిమాల్లో కమెడియన్ గా నటించిన బాబు మోహన్, చివరిగా 2015లో వచ్చిన లవకుశ సినిమాతో నటించడం ఆపేశారు. అయితే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే టీడీపీ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన బాబూమోహన్, 1999లో టిడిపి తరపున మెదక్ జిల్లా ఆంథోల్ నియోజకవర్గం నుండి ఎమ్యెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖామంత్రిగా కూడా పనిచేసారు. అయితే ఆపై జరిగిన 2004 ఎన్నికల్లో కూడా విజయం సాధించిన బాబు మోహన్, అనంతరం 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 

 

ఇక ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం విడిపోయాక టిఆర్ఎస్ లో చేరి 2014 ఎన్నికల్లో విజయం సాధించి, అనంతరం ఇటీవల బిజెపిలో చేరారు. అయితే మొన్నటి 2019 ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసి ఓడిపోయిన బాబు మోహన్, ప్రస్తుతం వయసు మీద పడడంతో ఎక్కువగా ఇంటివద్దనే ఉంటున్నట్లు సమాచారం. 1952, మార్చి 19న జన్మించిన బాబూమోహన్ కు ప్రస్తుతం 67 సంవత్సరాలు. ఆయన భార్య ఇంద్ర విజయలక్ష్మి, వారికి ఇద్దరు కుమారులు, కాగా వారి పెద్ద కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబరు 13 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇక ఆ తరువాత నుండి కొంత మానసికంగా కృంగిపోయిన బాబు మోహన్, ఇక ఇటీవల రాజకీయాల్లో కూడా దెబ్బతినడంతో మరింత ఆవేదనకు గురవుతున్నట్లు సమాచారం. ఇక పలువురు ప్రేక్షకులు ఆయన జీవితం రాబోయే రోజుల్లో మంచి స్థితికి చేరాలని, అలానే వారి ఆరోగ్యం కూడా కుదుటపడి మళ్ళి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: