ఒకప్పుడు సినిమాల్లో రంగుకి అంత విలువ ఇచ్చేవారు కాదు.. కేవలం ముఖంలో కళ.. పాత్రకు తగ్గ శరీరం ఉంటే చాలు.. ఎంత నల్లగా ఉన్న సినిమాల్లో అవకాశాలు ఇచ్చి తారాస్థాయికి చేర్చేవాళ్ళు.. కానీ ఈ కాలంలో రంగు లేకుంటే చూడను కూడా చూడరు.. ఎప్పుడో ఎక్కడో నల్లగా ఉన్న ఒక్కరికో ఇద్దరికో అవకాశాలు ఇచ్చి స్టార్స్ చేస్తారు కానీ.. మోహంలో ఎంత కళ ఉన్న సరే రంగు తక్కువ ఉంటే పట్టించుకోరు.. 

 

ఎందుకంటే.. మన టాలీవుడ్ ప్రేక్షకులు రంగు లేకుంటే అసలు చూడను కూడా చూడరు.. రంగు ఉంటే మొహంలో కళ లేకపోయినా వావ్ సూపర్ అంటూ చూస్తారు.. వారికే చెప్పట్లు కొడుతారు.. అందుకే మన సినిమాలో చాలావరకు రంగు ఉన్నవాళ్లే ఉన్నారు.. ఇక ఇప్పుడు కాదు కానీ.. ఒకప్పుడు కొందరు హీరోయిన్లు రంగు పెద్దగా లేకపోయినా హిట్ అయ్యారు. అలా హిట్ అయినా హీరోయిన్లలో ప్రియమణి, నయనతారలు ఉన్నారు. 

 

నిజానికి.. నయనతార.. ప్రియమణి ఒకప్పుడు అంత అందంగా లేరు.. అప్పుడు వాళ్ళ ఫోటోలు చూస్తే వీళ్ళు ఇప్పుడు ఎలా ఇంత అందంగా తయారు అయ్యారు? అసలు ఎలా అయ్యారు అని మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.. అలా ఉన్నారు ఆ హీరోయిన్లు.. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్స్ గా కూడా సెట్ అవ్వరు.. అలాంటి వీళ్ళు స్టార్ హీరోయిన్స్ ఎలా అయ్యారు? అని ఆశ్చర్యం వేస్తుంది. 

 

అంతేకాదు.. అప్పట్లో ఆ రంగుతో ఉన్న వీళ్ళు ఇప్పుడు పాలరాతి బొమ్మల్లా మెరిసిపోతున్నారు.. వావ్.. ఎంత బాగున్నారు అని అనిపించేలా ఇప్పుడు వీళ్ళ లుక్స్ ఉంటున్నాయి. నిజానికి వీళ్ళే కాదు.. త్రిష.. అమలాపాల్, ఇలియానా ఇలా చాలామంది హీరోయిన్లను మొదటి సినిమా చూసి ప్రేక్షకులు వీళ్ళు హీరోయిన్స్ ఏంటి అనుకున్నారు.. అలా అనుకున్నవారు కొద్దిరోజులకు స్టార్ హీరోయిన్లు అయ్యారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: