యువ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మ సక్సెస్ జోష్ లో ఉన్నాడు. వెంకీ కుడుముల డైరక్షన్ లో నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో డైరక్టర్ వెంకీను పొగడ్తలతో ముంచెత్తాడు నితిన్. స్వతహాగా నితిన్ కు ఫ్యాన్ అయిన వెంకీ దిల్ సినిమా టైం లో కొడితే చూశారు ఇప్పుడు ఎందుకు చూడరని నమ్మకంతో భీష్మ తీశాడు. అయితే వెంకీ మాట్లాడిన తర్వాత మైక్ అందుకున్న నితిన్ ఈ స్క్రిప్ట్ నీదేనా..? ఈ కథ నువ్వే రాశావా..? అని అడిగాడు.

 

నితిన్ అలా అడిగింది ఎందుకో తెలిసిందే. వెంకీ మొదటి సినిమా ఛలో సూపర్ సక్సెస్ అయ్యింది. నాగ శౌర్య హీరోగా తన పేరెంట్స్ నిర్మించిన ఆ సినిమా సక్సెస్ తర్వాత వెంకీ బయటకు వచ్చేశాడు. రీసెంట్ గా అశ్వద్ధామ ప్రమోషన్స్ లో వెంకీ మీద చాలా కామెంట్స్ చేశాడు వెంకీ కుడుముల. ఛలో కథ తనదే అని తానే వెంకీకి స్క్రిప్ట్ లో సపోర్ట్ చేశానని చెప్పాడు. అయితే భీష్మ ప్రమోషన్స్ లో వెంకీని ఈ ప్రశ్న అడిగితే ఆ సినిమాకు ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్లకి ఇచ్చానని చెప్పాడు.

 

ఇక లేటెస్ట్ గా నాగ శౌర్య కామెంట్స్ పై సెటైర్ వేస్తూ నితిన్ భీష్మ స్క్రిప్ట్ నీదేనా.. ఈ కథ నిజంగా నువ్వే ఆశావా అని అడగడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వేశారు. కావాలనే నితిన్ నాగ శౌర్య పై పంచ్ వేశాడని తెలుస్తుంది. అంతేకాదు వెంకీది ఓన్ టాలెంట్ కాకుంటే ఛలో ఏదో లక్కీగా సక్సెస్ అయినా భీష్మ తన సొంత టాలెంట్ తో హిట్ అందుకున్నట్టే. ఈ విషయంలో నాగ శౌర్యకు వెంకీ కరెక్ట్ సమాధానం చెప్పినట్టు అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: