చిత్రపరిశ్రమలో ఆత్మహత్యలు సర్వసాధారణమై పోయాయి.. కారణాలు ఏవైన ఎదురయ్యే సమస్యలను  అధిగమించలేక ఎందరో తారలు నేలరాలిపోయారు.. అందులో చెప్పుకోవలసిన పేరు దివ్యభారతి.. అతి చిన్న వయస్సులోనే సినిమారంగంలోకి ప్రవేశించిన ఈ అందాల తార ఎంత వేగంగా తనను తాను నిరూపించుకుని స్టార్ హోదాను సాధించిందో అంతే వేగంగా ఈ ప్రపంచం నుండి దూరమైపోయింది..

 

 

ఇకపోతే ఉత్తరాది భామ అయిన దివ్యభారతికి మొదటి అవకాశం తెలుగులోనే వరించింది.. సురేష్ ప్రొడక్షన్స్ లో బొబ్బిలి రాజా చిత్రం తో దివ్య భారతి తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ బ్యూటీకి వరుస ఛాన్సులు వచ్చాయి. 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది. ఆ తర్వాత ఏప్రిల్ 1993 లో అనుమానాస్పదంగా మరణించింది. అప్పటికి ఆమె వయస్సు పందొమ్మిది ఇరవై మధ్యలో ఉంది..

 

 

కెరియర్ మంచిగా పుంజుకుంటున్న సమయంలో దివ్యభారతి చేసిన తప్పు ఏంటంటే పెళ్లిచేసుకోవడం.. అది ఆ వయస్సులో ప్రేమించి వివాహం చేసుకోవడం.. సామాన్యంగా పందొమ్మిది సంవత్సరాల వయస్సులో మానసిక పరిణితి అంతగా వికసించదు. అందులో చిత్రపరిశ్రమలో పదహారు సంవత్సరాలలో అడుగుపెట్టి, పందొమ్మిది సంవత్సరాల్లో పెద్ద హీరోయిన్‌గా మారిన దివ్యభారతికి ఆ రంగుల ప్రపంచం వెనుక దాగి ఉండే చీకటి కోణాలు అంత త్వరగా అర్ధం కావు..

 

 

ఆ రంగులను కూడా తన జీవితానికి అన్వయించుకుని పొరపాటు చేసింది.. ఆ పొరపాటే ఆమె ప్రాణం పోవడానికి మూలకారణం.. కాని ఆమె మరణానికి ఎన్నో కారణాలను వెతుకుతున్నారు గాని ఇంతవరకు నిజ నిజాలు తేల్చలేక పోయారు.. ఒక్క ఆలోచన జీవితాన్ని మారుస్తుంది అనేది ఎంత నిజమో, ప్రతి వ్యక్తి తన జీవితంలో తీసుకునే నిర్ణయం అతని భవిష్యత్తును నిర్ణయిస్తుందనేది అంతే సత్యం... ఇదే దివ్యభారతి మరణానికి కారణం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: