అవును అబ్బా.. ఈ కాలంలో కావాలనే వివాదంలోకి దురాలి అని చూసే స్టార్స్ లో గాయని చిన్మయి ఒకరు అని అంటుంటారు నెటిజన్లు.. ఎప్పటికప్పుడు వివాదాల్లో కురుకుపోతుంటుంది ఈ చిన్మయి.. తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో తన మధురమైన స్వరంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గాయని చిన్మయి. 

 

అలాంటి గాయని రెండు సంవత్సరాల క్రితం వరుకు మంచి సింగర్.. సమంతకు అద్భుతమైన డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. అలాంటి గాయని.. మీటు అంటూ ప్రముఖ లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించారని చెప్పి వివాదంలో ఇరుక్కుందో అప్పటి నుండి ఆమెను గాయని కంటే కూడా మీటు బాధితురాలిగానే ఎక్కువమంది గుర్తుపడుతున్నారు. 

 

చాలామంది ఆమె చెప్పిన మాటలు నమ్మలేదు.. అంతేకాదు.. అప్పటి నుండి నెలకు ఒకసారైనా ఆమె ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది.. ఫెమినిజం అని... ఏదైనా సినిమాల్లో సీన్లపై కూడా రియాక్ట్ అయ్యి అందులో ఎం లేదు అని తెలుసుకొని వివాదానికి గురవుతుంటుంది. 

 

ఇకపోతే.. ఇప్పుడు మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది చిన్మయి. అది ఏంటి అంటే? లెజండరీ దర్శకుడు అయినా కే. బాలచందర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు చిన్మయి. ప్రముఖ తమిళ నటి రేఖ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమెకు కమల్ హాసన్, బాలచందర్ వల్ల ఎదురైనా చేదు అనుభవాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.. 

 

1986లో పున్నగాయ్ మన్నన్ అనే సినిమాలో రేఖ, కమల్ హాసన్ జంటగా నటించారు.. అయితే ఆ సినిమాలో హీరో.. హీరోయిన్ ఇద్దరు ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారు.. అయితే ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు అని చనిపోవాలి అని నిర్ణయించుకుంటారు.. అయితే ఆత్మహత్య చేసుకునే సన్నివేశం తెరకెక్కిస్తున్న సమయంలో కమల్ హాసన్ రేఖ‌కు ముద్దుపెట్టేసారట. ఈ విషయాన్నే ఆమె చెప్పింది. 

 

అయితే ఈ ఇంటర్వ్యూపై స్పందించిన చిన్మయి.. ''రేఖ గారు తనకు ఎదురైన అనుభవాన్ని నవ్వుతూనే చెప్పారు. ఎందుకంటే మళ్లీ ఎవరైనా తనను వేలెత్తి చూపుతారేమోనన్న భయంతో. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆడవాళ్లు ఇదంతా సాధారణమే అన్నట్లుగా ఎలా అణిగి మణిగి ఉంటారో చూసారా? ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మగవాళ్లు ఎంత తప్పుగా ప్రవర్తించినా ఏమీ కానట్టు ఉండాలని చిన్నప్పటి నుంచే ఆడవాళ్లను ఆ మైండ్‌ సెట్‌తో పెంచుతారు. అందుకే షావుకారు జానకిలాంటి వాళ్లు మీటూ ఉద్యమాన్ని చిన్నచూపు చూసి మాట్లాడినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు. 

 

ఈ వీడియోలో రేఖ గారు తన అనుమతి లేకుండా కమల్ హాసన్ ముద్దు పెట్టారు అని అన్నారు.. సెట్‌లో ఉండే మగవారు ముద్దును సీన్‌లో భాగంగా చిత్రీకరించేసి అది సాధారణమే అని చెప్పేస్తుంటారు. అదే విధంగా కొందరు గొప్ప దర్శకులు కొట్టడాన్ని కూడా సాధారణంగానే చూపించేస్తుంటారు. ఇవి ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే రేఖ కేవలం అప్పట్లో షూటింగ్‌లో జరిగిన సంఘటనను ఇప్పుడు మామూలుగా వెల్లడించారు. కానీ మన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల చేత నటింపజేయాలని వారి బుగ్గలు వాచిపోయేలా కొట్టి దాన్ని గర్వంగా చెప్పుకునే దర్శకులు కూడా ఉన్నారు'' అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చిన్మయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: