ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్  డైరెక్టర్గా కొనసాగుతూ తనదైన స్వరాలతో ప్రేక్షకులను మాయ చేస్తూ... తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో మ్యూజిక్ అందిస్తూ... అద్భుతమైన స్వరాలను సమకూరుస్తూ... ప్రేక్షకులందరినీ మెస్మేరైజ్ చేస్తున్నాడు.  ప్రస్తుతం ఎక్కువ సినిమాల్లో టాప్  కంపోజర్ గా  దుమ్మురేపుతున్నడు. మొన్నటికి మొన్న తన కంపోజ్ చేసిన అలా వైకుంఠపురములో పాటలు ఏ రేంజ్ లో సక్సెస్ సాధించాయో  అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం తమన్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ  సినిమా పింక్ రీమేక్ కి కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే తమను క్రేజ్ ఓన్లీ టాలీవుడ్ కూ  మాత్రమే పరిమితం కాలేదు అటు కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకున్నాడు. 

 

 

 

 ప్రస్తుతం తమిళంలో కూడా వరుస  సినిమా అవకాశాలను దక్కించుకునేందుకు బాగానే కష్టపడుతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ ని కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. హీరో విజయ్ ఒక గొప్ప నటుడు అంటూ తమన్  కితాబిచ్చాడు. విజయ్ సినిమాకు వర్క్ చేయాలని తాను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా దర్శకుడు అట్లీ గురించి కూడా మాట్లాడుతూ పొగడ్తలతో ఆకాశానికి కురిపించాడు.దర్శకుడు అట్లీ మాత్రమే హీరో ని ఏ రేంజ్ లో చూపెట్టాలి... ఫ్రాన్స్ కి ఎలా కావాలో  అలాగే చూపిస్తాడు ప్రశంసల వర్షం కురిపించాడు. 

 

 

 

 దీంతో తమన్  కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇప్పటివరకు తనదైన పాటలతో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించి మాయచేసిన తమన్.. ఇప్పుడు ఏకంగా మాటలతో కూడా మాయ చేస్తూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు నెటిజన్లు. ఇటీవలే పవన్ ను కలిసినప్పుడు కూడా... ఇది ఎంతో గొప్ప విషయం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీ హీరో  హీరో విజయ్ పై  కూడా ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇదంతా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా తన స్వరాలతో ప్రేక్షకులను బుట్టలో వేసుకున్న తమన్... తన మాటలతో హీరో దర్శకులు కూడా వేసుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: