టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వివి వినాయక్ ఒకరు. కెరీర్ మొదట్లో ఎక్కువగా మాస్ సినిమాలు తీసిన వినాయక్ ఆ తరువాత కథలో కామెడీని మిక్స్ చేస్తూ సినిమాలను తెరకెక్కించారు. వివి వినాయక్ పై నమ్మకంతో సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున అఖిల్ తొలి సినిమా దర్శకత్వ బాధ్యతలను వినాయక్ కు అప్పగించారు. 
 
కానీ అఖిల్ పేరుతో తెరకెక్కిన అఖిల్ తొలి సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వివి వినాయక్ డైరెక్షన్ పై కూడా విమర్శలు వచ్చాయి. అఖిల్ ఫ్లాప్ తరువాత చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150కు వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హిట్టైనా రీమేక్ కావడంతో వినాయక్ కెరీర్ కు ఈ సినిమా ఉపయోగపడలేదు. 2018లో విడుదలైన ఇంటెలిజెంట్ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చివరి సినిమా. 
 
సినిమా కూడా డిజాస్టర్ కావడం తో వినాయక్ కు అవకాశాలు ఇచ్చేవారే కరువయ్యారు. అలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివి వినాయక్ తో సీనయ్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటన చేశారు. ఈ సినిమా స్క్రిఫ్ట్ సంతృప్తికరంగా లేకపోవడం, స్వతహాగా వినాయక్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా కథ, కథనాల విషయంలో వినాయక్ జోక్యం చేసుకున్నారు. 
 
ఆ తరువాత కూడా స్క్రిప్ట్ సంతృప్తికరంగా లేకపోవడంతో దిల్ రాజుకు అదే విషయాన్ని వినాయక్ చెప్పారు. తాజాగా దిల్ రాజు స్క్రిప్ట్ పై సందేహాలు రావడంతో ఈ ప్రాజెక్టు ఆపేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దాదాపుగా ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లే అని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా దిల్ రాజు స్క్రిప్ట్ ఎంతో నచ్చితే తప్ప సినిమాను ఓకే చేయరు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం దిల్ రాజు పొరపాటు చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: