వెనకటికి ఎవడో ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అందట అన్న సామెత నిజం చేసేవాడు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మనం ఏ పొజిషన్ లో ఉన్నాము. దానిని నిలబెట్టు కోకుండా కొండకు నిచ్చెన వేసి ఎక్కాల‌నుకుంటే బొక్కబోర్లా పడతాము. ఈ మాట కమెడియన్సు సునీల్ విషయంలో నూటికి నూరు శాతం వర్తిస్తుంది. టాలీవుడ్ లో 2011 లో సునీల్ సినిమా ఉందంటే చాలు అప్పట్లో కుర్రకారు హీరోతో సంబంధం లేకుండా సినిమాలకు పరుగులు పెట్టే వాళ్ళు. నువ్వు నేను, మనసంతా నువ్వే, పెళ్ళాం ఊరెళితే లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన సునీల్ అప్పట్లో స్టార్ హీరో అయిపోయాడు.

 

అదే టైంలో సునీల్ కు స్టార్ హీరోలు అయిన విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర ఠాగూర్ సినిమాలో సైతం అవకాశం వచ్చింది. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల పాటు తెలుగు సినిమా రంగంలో తిరుగులేని కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్ అందాలరాముడు సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అవడంతో సునీల్ పెద్ద రాంగ్ స్టెప్ వేసాడు. తాను పాపులర్ అవటానికి కీలకమైన కమెడియన్ రోల్ వదిలేసి హీరోగా సెటిల్ అయిపోదామని డిసైడ్ అయ్యాడు.

 

కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఒకటి రెండు సినిమాల తర్వాత సునీల్ కు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా సూపర్ హిట్ అవడంతో ఇక హీరోగా తనకు తిరుగులేదని అభిప్రాయానికి వచ్చేశాడు అక్కడ నుంచి సునీల్ డ‌జ‌న్‌కు పైగా సినిమాలు చేసిన ఒక్క హిట్ కూడా రాలేదు సునీల్ కెరీర్లో చివరి హిట్ సినిమా మర్యాదరామన్న మాత్రమే వరుస ఫ్లాపుల తర్వాత కెరీర్ పరంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సునీల్ తిరిగి ఇప్పుడు కమెడియన్ వేషాలు వేస్తున్నాడు. అదే సునీల్ హీరోగా కమెడియన్ గానూ కొనసాగించి ఉంటే నేడు తెలుగు సినిమా రంగంలో తిరుగులేని స్టార్ కమెడియన్ గానూ హీరోగా ఓ వెలుగు వెలిగి ఉండేవాడు. ఏదేమైనా తన కెరీర్‌ను చేతులారా తానే నాశనం చేసుకున్నాడు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: