సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ల గురించి తెలిసిన విషయమే. ఫలానా నెలలో రిలీజ్ చేయాలని, లక్కీ డేట్లలో రిలీజ్ చేయాలని, పండుగ, స్కూల్ సెలవలు.. ఇలా సెంటిమెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు ఇప్పుడు అలాంటి సెంటిమెంటే ఒకటి వర్క్ అవుట్ అయినట్టుందని అంటున్నారు. వరుసగా తొమ్మిది ఫ్లాపుల తర్వాత వచ్చిన ఓ హిట్ కు ప్రస్తుతం వచ్చిన హిట్ కు పోలికలు ఉండటమే ఇందుకు కారణం.

 

 

నితిన్ – నిత్యమీనన్ హీరో హీరోయిన్లుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇష్క్. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఏకంగా 11 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శితమై శతదినోత్సవ చిత్రంగా నితిన్ కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. ఈ సినిమా 2012లో ఫిబ్రవరి 24న విడుదలైంది. ప్రస్తుతం నితిన్ నటించిన భీష్మ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయి తెలుగు రాష్ట్రాలతోపాటు యూఎస్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈనెల 21న విడుదలైన ఈ సినిమా ఏకంగా నితిన్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచి కేవలం అయిదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదలైంది. ఈ సినిమాకు ముందు కూడా నితిన్ కు మూడు ఫ్లాపులు ఉన్నాయి.

 

 

ఈ రెండు సినిమాల ముందు ఫ్లాపులు.. తర్వాత హిట్లు.. ఇదంతా సెంటిమెంట్ వర్క్ అవుట్ కావడమేనంటూ సరదా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సినిమా హిట్ కు కథ, కథనాలే ముఖ్య పాత్ర పోషిస్తాయనేది నిజమే అయినా ఇటువంటి సెంటిమెంట్లు మాత్రం కామన్. ఏమైనా.. నితిన్ కు ఫిబ్రవరి కలిసొచ్చి రెండు బ్లాక్ బస్టర్లు కొట్టేశాడనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: