నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 చిత్రం.. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమా త్వరలో పట్టాలెక్కేయనుంది

 

గత ఏడాది నందమూరి బయోపిక్ కి సంబంధించిన రెండు సినిమాలతో పాటు రూలర్ సినిమా పరాజయం పాలు కావడంతో నందమూరి అభిమానులు ఫుల్ నిరుత్సాహంలో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో తనకి అదిరిపోయే 2 సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను నే ఇప్పుడు బాలయ్య నమ్ముకున్నాడు.

 

కానీ తాజాగా నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడంతో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా శ్రేయను తీసుకున్నారుమరో హీరోయిన్ గా తెలుగమ్మాయి అంజలిని తీసుకున్నారని తెలుస్తోంది.  అంజలి గతంలో బాలయ్యతో కలిసి డిక్టేటర్ సినిమాలో నటించింది. అంజలి అందాలు సినిమాకు ప్లస్ కాబోతున్నాయి.  సింహా, లెజెండ్ ను మించేలా సినిమా ఉండబోతుందని ఫిల్మ్ నగర్ టాక్

 

సినిమాలో బాలయ్యకి విలన్ గా హీరో రాజశేఖర్, శ్రీకాంత్, సునీల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి కానీ దీనిపైన చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేదు. సినిమాలో బాలకృష్ణ అఘోరగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా సినిమాలో బాలయ్య లుక్ మారనుందని సమాచారం. తమన్ సినిమాకు బాణీలు అందిస్తాడు. సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

 

ఇక పోతే బాలయ్య సరసన నటించేందుకు బోయపాటి కొంత మంది స్టార్ హీరోయిన్ లను ఆశ్రయించగా…. వారెవరూ అందుకు సముఖంగా లేరని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. చాలా మంది యువ భామలతో పాటు సీనియర్ కథానాయికలు సైతం బాలయ్యతో నటిస్తే ఇక అన్నీ సీనియర్ హీరోల సినిమాలే వస్తాయని…. ఇంకా తమ కెరీర్ సమాప్తం అయిపోతుందని భావిస్తున్నారట. అందుకే అసలు అవకాశాలే లేని అంజలితో వారు సరిపెట్టుకోవాలసి వచ్చిందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: