రాను రాను టివి షోల్లో క్రియేటివిటీ శృతిమించిపోతుందని చెప్పొచ్చు. కామెడీ కోసం రకరకాల రియాలిటీ షోలు చేయడం జరుగుతూనే ఉంది. కాని లేటెస్ట్ గా హాట్ యాంకర్ అనసూయతో ఇంటి గొడవని వీధిన పడేలా చేస్తున్నారు. ఈటివి, మాటివి, జీ టివిల పోటీకి తట్టుకోవాలని జెమిని టివి ఎంత ప్రయత్నిస్తున్నా వర్క్ అవుట్ అవట్లేదు. అందుకే ఈసారి సరికొత్త రియాలిటీ షోతో పర్ఫెక్ట్ ప్లాన్ తో వస్తున్నారు. అదికూడా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న అనసూయతో ఈ షో ప్లాన్ చేశారు.  

 

ఇంతకీ అనసూయ చేస్తున్న ఆ షో ఏంటి అంటే.. తల్లా..? పెళ్ళామా..? ఈ టైటిల్ ఏంటి..? ఈ టైటిల్ తో షో ఏంటనే కదా మీ డౌట్. ఒక మగాడి జీవితం గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని చెప్పాల్సిందే. పెళ్లి తర్వాత అత్తా కోడళ్లు.. అదే భార్య, తల్లి మధ్య గొడవలు సహజం. అలాంటి టైం లో మనం ఎవరికి సపోర్ట్ చేస్తే వారు విన్నర్ అవుతారు. ఆ టైంలో అమ్మకి సపోర్ట్ చేస్తే పెళ్లాం తో చీవాట్లు.. పోని భార్యకు సపోర్ట్ చేస్తే తల్లులు ఫీల్ అవుతారు. అందుకే వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే బెటర్.

 

అయితే తల్లా..? పెళ్ళామా..? షో ఇదే కాన్సెప్ట్ తో రాబోతుందని తెలుస్తుంది. ఇందులో పాల్గొనేది సెలబ్రిటీ అత్తా కోడళ్లు అయితే ఇంకాస్త క్రేజీగా ఉంటుంది. రియాలిటీ గేం షోగా జెమిని టివి స్టార్ట్ చేస్తున్న ఈ షో ప్రోమో కూడా ఆకట్టుకుంది. యాంకర్ అనసూయ కాబట్టి ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ చూసినా షో సక్సెస్ అయినట్టే. మరి అనసూయ ఈ షోని ఎలా చేస్తుందో చూడాలి.  జబర్దస్త్ షోతో సూపర్ పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: