ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ ఓ వెలుగు వెలిగిన దర్శకుడు శ్రీనువైట్ల. ఆయన దర్శకత్వంలో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ లాంటి ఎందరో స్టార్ హీరోలు పనిచేశారు. కానీ గత కొన్ని రోజుల నుండి శ్రీనువైట్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. వరుసపెట్టి ఫ్లాప్ సినిమాలు తీస్తున్నాడు. మొన్నటికి మొన్న రవితేజ తో తీసిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయంగా మిగిలింది. తాను మునుపటి  కంటే ఇప్పుడు అప్డేట్ అయ్యానని చెప్తున్నా కూడా శ్రీనువైట్లతో ఏ హీరో పనిచేయడానికి సుముఖత చూపట్లేదు.

 

 

దూకుడు వంటి మాస్ హిట్ ఇచ్చిన శ్రీనువైట్లతో మహేష్ బాబు వర్క్ చేస్తాడని వార్తలు వచ్చాయి. వైట్ల కథ కూడా వినిపించాడని అన్నారు. అయితే మహేష్ ప్రస్తుతం వంశీతో సినిమా క్యాన్సిల్ చేసుకుని మరో దర్శకుడి వేటలో పడ్డాడు. అలాగే చిరంజీవికి కూడా కథ చెప్పాడట. వీరిద్దరూ తమ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారట. అయితే ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్లతో పనిచేయడానికి వీరిద్దరూ ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.

 

 

అందుకే కొన్ని రోజుల తర్వాత వైట్లకి నో చెబుతారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీనువైట్ల చిన్న హీరోలతో ఎందుకు పనిచేయడం లేదనే వాదన కూడా వస్తుంది. స్టార్ హీరోల దగ్గరకి వచ్చే ముందు తాను ఒక చిన్న హీరోతో సినిమా తీసి హిట్ చేసుకుని వస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. చిన్న సినిమా ద్వారా తనని తాను నిరూపించుకుని స్టార్ హీరోల వద్దకి వెళ్తే ఏమైనా లాభం ఉంటుందని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

 

 

మరి నెటిజన్లు చెప్పినట్టు శ్రీనువైట్ల చిన్న హీరోతో సినిమా తీస్తాడా లేదా అన్నది చూడాలి.  కానీ పెద్ద పెద్ద స్టార్స్ తో వర్క్ చేసిన దర్శకుడు సడెన్ గా చిన్న హీరోలతో సినిమా చేయాలంటే కొంచెం ఆలోచిస్తాడు. శ్రీనువైట్ల ప్రస్తుతమ్ అదే డైలమాలో ఉన్నాడని చెబుతున్నారు. మరి వైట్ల మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: