మంచు మనోజ్, విష్ణు ఈ ఇద్దరు బ్రదర్స్ సినిమాల లో ఎక్కువ హిట్స్ దక్కించుకోలేక పోయారు. ఎన్ని సినిమాలు వచ్చినా సినిమా హిట్ అందుకోవడం కష్టం అయ్యి పోయింది. అయితే మంచు మనోజ్ 1993 లో మేజర్ చంద్ర కాంత్ సినిమా లో బాల నటుడి గా పరిచయం అయ్యడు. తర్వాత పుణ్య భూమి నా దేశం, అడవి లో అన్న, ఖైదీ గారు వంటి చిత్రాల లో హీరో మనోజ్ బాల నటుడి గా చేసాడు. దొంగ దొంగది, పొలిటికల్ రౌడి, శ్రీ ఇలా అనేక సినిమాల లో మంచి పాత్రల లో నటించాడు.
 
 
IHG
 
 
కానీ అదృష్టం అంతగా రాలేదు. సినిమాలు కూడా తారా స్థాయి కి చేరలేదు. బిందాస్ సినిమా కి గాను స్పెషల్ జ్యూరి అవార్డు లభించడం నిజంగా గొప్ప విషయం. తాజాగా తన భార్య ప్రణతి రెడ్డి తో విడాకులు తీసుకున్న వార్త తెలిసిన విషయమే. 
 
 
కానీ ఇప్పుడు మంచు మనోజ్ మరో కొత్త సినిమా తో రాబోతున్నాడు అన్న వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అలానే మంచు విష్ణు మొదట 1985 లో రగిలే గుండెలు చిత్రం లో బాల నటుడి గా నటించాడు. తరువాత 2003 లో విష్ణు సినిమాకి గాను హీరో విష్ణు కి ఫిలిం ఫేర్ అవార్డు ఉత్తమ తొలి చిత్ర నటుడి గా విష్ణు కి దక్కింది.
 
 
IHG
 
 
అయితే తర్వాత సూర్యం, అస్త్రం, ఢీ, వస్తాడు నా రాజు వంటి ఎన్నో చిత్రాలు చేసినా అంత హిట్స్ మాత్రం దక్కలేదు. కానీ చాలా కాలం నుండి కూడా విష్ణు  కొత్త సినిమాల తో కనపడ లేదు. ఇలా మంచు విష్ణు, మనోజ్ కూడా సినిమాలు లో కనపడడం తగ్గిపోయింది.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: