ఏంటో ఈ మధ్య తప్పుడు ప్రచారాలు మరి ఎక్కువ అయిపోయాయి... ఎవరు ఎవరి మీద చేస్తున్నారు అనేది కూడా ఒళ్ళు తెలీకుండా ప్రచారాలు చేసేస్తున్నారు.. మొన్నటికి మొన్న దిల్ రాజు పెళ్లి అని తప్పుడు ప్రచారం చేశారు.. ఇప్పుడు ఏకంగా పెళ్లే జరిగిపోయింది అంటున్నారు.. రెండు రోజుల నుండి ప్రతిఒక్కరు పెళ్లి అయ్యిందంటా.. అయ్యిందంటా అని రాసేస్తున్నారు.. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయినా దిల్ రాజుకు త్వరలో రెండో పెళ్లి అని కొద్దిరోజుల క్రితం వార్తలు సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి.. అయితే ఆ పెళ్లి వార్తలపై దిల్ రాజు స్పందించలేదు.. దీంతో ఆ వార్తల్లో నిజం ఉంది అని చాలామంది అనుకుంటున్నారు.. 

 

అలా అనుకోవడమే తప్ప దిల్ రాజు పెళ్లిపై ఎవరికి క్లారిటీ లేదు.. దీంతో ఇప్పుడు దిల్ రాజు పెళ్లిపై మళ్లీ వార్తలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.. దిల్ రాజుకు రెండో పెళ్లి సీక్రెట్ గా జరిగింది అని వార్తలు వస్తున్నాయి.. షాద్‌ నగర్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో దిల్ రాజు రెండో పెళ్లి జరిగింది అని విమానాశ్రయానికి షాద్ నగర్ దగ్గరగా ఉండటంతో దిల్ రాజ్ అక్కడ పెళ్లి చేసుకున్నట్టు సమాచారం.

 

అయితే దిల్ రాజు పెళ్లి జరిగింది అని వార్తలు రావడమే తప్ప ఎవరు అధికారకంగా పెళ్లి జరిగినట్టు ప్రకటించలేదు.. కాగా దిల్ రాజు భార్య అనిత మూడు సంవత్సరాల క్రితం మరణించారు.. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దిల్ రాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది బయటకు రాలేదు కానీ ఆ యువతీ వయసు 30 ఏళ్ళు అని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ దిల్ రాజు చెప్తే తప్ప తెలియదు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: