పౌరసత్వ బిల్లుపు కొంత కాలంగా రగడ కొనసాగుతుంది.  ఢిల్లీలో సిఏఏ అల్లర్ల కారణంగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.  నిరసనల ముసుగులో హింసాకాండ చెలరేగడంతో దాదాపుగా 32 మంది మరణించినట్టుగా తెలుస్తోంది.  ఈ మరణాలు మరిన్ని పెరిగే అవకాశం ఉందంటున్నారు.  ఈ మద్య ట్రంప్ భారత్ ప్యటనకు వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి.  ఇప్పటికే ఢిల్లీలో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే.  ఇక ట్రంప్ భారత్  నుంచి వెళ్లిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. అయన అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అందరూ భారతీయులలే అని, ఎలాంటి అభద్రతా భావం ఉండదని ప్రజలకు నచ్చజెప్పారు. అంతే కాదు ప్రభుత్వం ఢిల్లీ అల్లర్ల బాధ్యతలను ఎన్ఐఏ కు అప్పగించింది.

 

ఢిల్లీలో చెలరేగిన అల్లర్లకు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని,  చనిపోయిన వారి విషయంలో సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.  ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బిల్లులు అమల్లోకి తీసుకు వస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.  తాజాగా ఈ సిఏఏ అల్లర్ల  కారణంగా మరణించిన వారిపై సానుభూతి వ్యక్తం చేస్తూ.. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్  ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.   ఇటీవల సూపర్ స్టార్ రజిని కాంత్ గతం లో  సిఏఏ  కు తాను వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించడంతో అంత ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

 

దాంతో రజిని బీజేపీ మనిషని అంతా మాట్లాడుకున్నారు. ఆయన పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ లో రోజు రోజుకు హింసాత్మక రూపంలోకి మారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.. ఇది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి హింసను ఉక్కు పిడికిలితో అణచివేయాలి.  సిఏఏ వలన ఏ ముస్లిం నష్టపోయినా వారికి సపోర్ట్ చేసే మొదటి వ్యక్తిని నేనే అంటూ తెగేసి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: