హాలీవుడ్ పాప్‌ బ్యూటీ బ్రిట్నీ స్పియర్స్‌ తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ షాకింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవల తాను డాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా ఆమె కాలు విరిగిన వీడియోను అభిమానులతో షేర్‌ చేసుకుంది బ్రిట్నీ. తన సోషల్‌ మీడియా పేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేసింది పాప్‌ బ్యూటీ. ఆ వీడియోలో ఎల్లో కలర్‌ స్పోర్ట్స్ బ్రా, బ్లాక్‌ షార్ట్ దర్శించి నెక్ట్స్‌ షో కోసం ప్రాక్టీస్ చేస్తోంది ఈ భామ.

 

ప్రాక్టీస్‌లో భాగంగా కొన్ని జంప్‌లు, గుండ్రంగా తిరుగుతూ చేసే డ్యాన్స్‌ మూమెంట్స్‌ను ప్రాక్టీస్ చేసింది బ్రిట్నీ, అయితే వీడియో చివర్లో ఓ క్రాక్‌ సౌండ్‌ వినిపించటం, వెంటనే ఒక్కసారిగా గాయని తన కాళు పట్టుకొని కుప్పకూలిపోవటం చూసి ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన బ్రిట్నీ, `గత ఆరు నెలలుగా నేను డ్యాన్స్ చేయలేదు. నాకు గాయం అయిన భాగంలో తీవ్రమైన బాధ ఉంది.

 

నాకు తెలుసు ఆరోజు నేను చెప్పుల లేకుండా డాన్స్ ప్రాక్టీస్‌ చేశాను. అలా అయితే ఫ్లోర్‌ గ్రిప్‌ బాగుటుందని అలా చేశా. మీరు వీడియోలో నాకు కాలు ఎప్పుడు విరిగిందో స్పష్టంగా వినొచ్చు.` అంటూ కామెంట్‌ చేసింది. హాలీవుడ్‌లో నటిగా, గాయనిగా, లిరిసిస్ట్‌గా పేరు తెచ్చుకున్న బ్రిట్నీ ప్రొడక్షన్‌ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. వీడియో ఆల్బమ్స్‌ను నిర్మించిన బ్రిట్నీ, పలు టెలివిజన్‌ సిరీస్‌లను కూడా నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: