తెలుగు లో ఎన్టీఆర్ బయోపిక్ తో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న నందమూరి బాలకృష్ణ ఆ మద్య కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రూలర్’ మూవీ తో మరో భారీ డిజాస్టర్ అందుకున్నాడు.  ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూ.. ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నాడు బాలయ్య.  గతంలో తనకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటినే నమ్ముకున్నారు బాలయ్య.  ఇప్పటకే ఈ మూవీకి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ఇక మార్చ్ 2 న బోయపాటి-బాలయ్య మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు  వస్తున్నాయి.  గ్రహాలు .. అవి చూపే ప్రభావం ఈ కథలో ప్రధాన అంశంగా కనిపిస్తాయని అంటున్నారు.

 

ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బాలయ్య అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో బాలకృష్ణ అఘోరాగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.  మార్చి 2వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తొలి షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. ఈ  చిత్రంలో లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  గతంలో సింహా, లెజెండ్ లో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు.  ఆ రెండు చిత్రాలూ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.   రాయలసీమకి చెందినవాడిగా, కాశీలో అఘోరగా ఆయన కనిపించనున్నాడని అంటున్నారు.   ఈ మూవీలో హీరోయిన్లు గా శ్రియ, అంజలి పేర్లు వినిపిస్తున్నాయి.  అయితే కేథరిన్, కీర్తి సురేష్ లను సంప్రదించగా వారు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. 

 

తాజాగా సోనాల్ చౌహాన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మూడో హీరోయిన్ కి కూడా ఈ కథలో చోటు ఉందా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చిత్రం అనగానే ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి.  ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న తమ అభిమాన హీరో ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతారని గట్టిగా నమ్ముతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: