ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించింది థమన్ అందించిన సంగీతం. సినిమా విడుదలకు మూడు నెలల ముందు నుంచీ చేసిన హంగామా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోవడమే సినిమాకు బలమైంది. అయితే.. సినిమా విడుదలయ్యాక మాత్రం ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మ’ పాట అద్భుతాలే చేసింది.

 

 

భారతదేశ సినీ పరిశ్రమలోనే ఈ పాట సెన్షేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి నుంచి ఎంతోమంది ఈ పాటను ఎంజాయ్ చేశారు. టిక్ టాక్ వంటి ప్లాట్ ఫామ్స్ లో అయితే ఈ పాట భారీ భీభత్సమే చేసిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించి ఓ చిన్న విడీయో క్లిప్ ను సంగీత దర్శకుడు థమన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో కాలేజీ విద్యార్ధినులు అందరూ ఈ పాటకు ఊగిపోతూ.. అల్లు అర్జున్, పూజ హెగ్డే వేసిన స్టెప్ ను వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చెన్నైలోని ‘జస్టిస్ బషీర్ అహ్మద్ సయ్యద్ కాలేజ్ ఫర్ ఉమెన్(JBAS COLLEGE)’ లో ఈ సందడి జరిగినట్టు థమన్ తన అకౌంట్లో రాసుకున్నాడు.

 

 

థమన్ సంగీతం, బన్నీ స్టెప్స్, మేకింగ్ తో సంచలనం సృష్టించిన ఈ పాటను ఈ ఏడాది మరో పాట బీట్ చేస్తుందా అనే అనుమానాలను కూడా క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్న బుట్ట బొమ్మ పాట.. సినిమా విడుదలై 50రోజులు గడుస్తున్నా ఇంకా ఆ మేనియా కొనసాగుతూ ఉండడం నిజంగా అద్భుతమే. మరి.. ఈ మేనియా ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో మరెన్ని రికార్డులు ఈ పాట వశమవుతాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: