బాలక్రిష్ణ రీమేకులకు, రీమిక్సులకు అసలు ఇష్టపడరన్నది తెలిసిందే. ఆయన ఎపుడూ స్ట్రైట్. ఆయన మూవీస్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అందుకే బాలయ్య వంద సినిమాలు పైగా చేసినా కూడా ఒకటో రెండో రీమేకులు తప్ప  తప్ప ఎక్కువగా డైరెక్ట్ మూవీసే ఉంటాయి. ఇక బాలయ్య హీరోగా అయిన కొత్తల్లో రీమిక్స్ సాంగ్స్ కొన్ని పెట్టారు. ఇపుడు మాత్రం బాలయ్య అసలు ఒప్పుకోవడంలేదు. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే బాలయ్య ఓ టాప్ సూపర్  రీమిక్స్ సాంగులో  డ్యాన్స్ ఇరగదీయబోతున్నాడని.

 

అది కూడా బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీలోనే చేస్తున్నాడని అంటున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఆ రీమిక్స్ సాంగ్ కూడా బాలయ్య పాతికేళ్ళ క్రితం చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీ బంగారు బుల్లోడులో నుంచి అంటున్నారు. ఆ మూవీలో రవీనా టాండన్ తో బాలయ్య రెయిన్  సాంగ్ చేశాడు. అది అప్పటికీ ఇప్పటికీ కూడా సూపర్ హిట్.

 

స్వాతిలో ముత్యమంత ముద్దు అంటూ సాగే ఈ సాంగ్ లో రవీనా తడి తడి లేత అందాలకు నాటి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇపుడు కూడా టీవీలో ఆ సాంగ్ వస్తే అతుక్కుపోయే వారే ఎక్కువ. ఇక ఆ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసింది కోటి. ఇపుడు ఆ సాంగ్ రీమిక్స్ చేయబోయేది యంగ్ తరంగ్ టాలీవుడ్లో టాప్ కంపోజర్ గా ఉన్న తమన్.

 

ఈ సాంగ్ బాలయ్య బోయపాటి మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందిట. మరి బాలయ్య ఈసారి ఏ హీరోయిన్ తో ఈ సాంగ్ చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా అలనాటి సూపర్ మెలోడీ సాంగ్ మళ్ళీ బాలయ్య చేయడం, బోయపాటి చేయించడం అంటేనే ఈ మూవీ మీద అపుడే అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. సో ఈ హ్యాట్రిక్ మూవీ రిలీజ్ కోసం ఇప్పటి నుంచే బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మెలోడీ సాంగ్స్ ని ప్రేమించే ఆడియన్స్ కూడా వెయింటింగ్ ఇక్కడ.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: