ఇదేదో సాధారణ ఫోటోలా ఉంది కదూ.. పూజ గదిలోని ఫోటో ఇది. పాకులాడే ఓ పాప.. ఇద్దరు అబ్బాయిలు.. మరో పాప.. ఈ అబ్బాయిల ఇద్దరూ దేవుడికి నమస్కారం చేస్తున్నారు. మరో పాపం.. వాళ్లను గమనిస్తుంది. ఈ ఫోటోని ఓ యువ హీరో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. మరి ఇంతకీ ఈ ఫోటోల ఉన్నది ఎవరో గుర్తు పట్టారా..

 

 

పోనీ లెండి.. చిన్నప్పటి పోలికలు పోల్చుకోవడం ఎవరికైనా కాస్త ఇబ్బందే. అందుకే మీకు కొన్ని క్లూలు ఇస్తున్నాం.. ఈ హీరోలు మెగా కాంపౌండ్ హీరోలు.. ఇప్పుడైనా ఊహించండి. చెప్పలేకపోతున్నారా.. సరే మేమే చెప్పేస్తాం.. వాళ్లు మరెవరో కాదు టాలీవుడ్‌ యువ హీరోలు.. వారిలో ఒకరు హీరో రామ్‌ చరణ్‌.. మరి ఇంకో నటుడు ఎవరో తెలుసా..

 

 

ఆ రెండో హీరో రామ్ చరణ్ బావ సాయి ధరమ్‌ తేజ్‌. ఈ ఫోటోను హీరో సాయిధరమ్ తేజ్ బయట పెట్టారు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ చిన్నప్పుడు ఓ వేడుకలో సుస్మిత, రామ్‌చరణ్‌తో కలిసి తీసుకున్న ఫొటోను సాయితేజ్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోలో సాయితేజ్‌.. చిన్నారి శ్రీజ, రామ్‌చరణ్‌కు మధ్యలో ఉన్నారు.

 

 

ఈ ఫోటో చెన్నై నివాసంలో తీసుకున్నది. ఈ విషయాన్ని కూడా సాయి తేజ్ తెలిపారు. సుస్మిత, రామ్‌చరణ్‌, శ్రీజాలతో నేను అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. ఈ ఫొటోను చూసి మెగా అభిమానులు సంబరపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: