ఒక సినిమా తీయడం ఎంతటి కష్టమో ఆ సినిమాను విజయవంతం చేసుకోవడం కూడా అంతేకష్టం.  కష్టపడి సినిమా తీస్తే ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పడం చాలా కష్టం.  కొన్ని సినిమాలు విజయం సాధిస్తుంటాయి.  మరికొన్ని సినిమాలు ఫెయిల్ అవుతుంటాయి.  ఎలా చూసుకున్నా సినిమా ఇండస్ట్రీ అన్నది ఒక లాటరీ లాంటిది.  ఎప్పుడు సినిమాలు విజయం సాధిస్తాయో తెలియదు.  ఎప్పుడు ఫెయిల్ అవుతాయో తెలియదు.  


తెలియని సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా మారుతుందో తెలియకుండా ఇబ్బందులు పడుతుంటారు.  అయితే, మూవీ ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఒకలా ఉండదు.  ఒక్కోసారి ఒక్కో విధంగా మారిపోతూ ఉంటుంది.  మొత్తానికి చూసుకుంటే, ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి.  ప్రపంచం మొత్తం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా సినిమా పరిశ్రమ మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతున్నది.  


సినిమా టికెట్స్ విషయం చూసుకుంటే ఒక్క 2019 వ సంవత్సరంలోనే 103 కోట్ల టికెట్స్ అమ్ముడు పోయాయి.  ఇది ఒకవిధంగా రికార్డ్ అని చెప్పాలి.  ప్రింట్, టీవీ మీడియా వచ్చిన తరువాత సినిమా మీడియా తగ్గిపోతుందని అనుకున్నారు.  ఎక్కడా తగ్గకపోగా, పెరిగింది.  ఒక సినిమా థియేటర్లో ఆడేది వారం రోజులే అయినప్పటికీ కూడా సినిమా బాగుంది అంటే ఆ వారం రోజులు కూడా థియేటర్లో సందడి ఉంటుంది.  ఈ సందడి సినిమా టికెట్స్ భారీగా అమ్ముడు పోతుంటాయి.  


పైగా బాలీవడ్ లో వివిధ జానర్స్ లో బెస్ట్ సినిమాలు వస్తున్నాయి.  సినిమా టికెట్స్ భారీ స్థాయిలో అమ్ముడు కావడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు.  ఇలా ఎన్ని చెప్పుకున్నా ఫైనల్ గా మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఆర్ధిక మాంద్యం ఉన్నట్టుగా కనిపించడం లేదు.  వినోద రంగం ఎప్పుడు పైస్థాయిలోనే ఉంటోంది.  అందుకే ట్రంప్ ఇండియా వచ్చినపుడు దీని గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు.  బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కళకళలాడుతోందని ఇండియా ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకున్నారు.

">

మరింత సమాచారం తెలుసుకోండి: