సినిమారంగంలో హిట్లు ప్లాపులు అనేవి అత్యంత సహజం ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ దర్శకుడు చుట్టూ అందరూ వాలిపోతుంటారు. అదే ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ దర్శకుడి ని అందరూ దూరం పెట్టేస్తుంటారు. బెల్లం చుట్టూ ఈగలు అన్న సామెత చందంగా ఏ రంగంలో అయినా సక్సెస్ రేటు ఉన్న వాళ్ల చుట్టూనే ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కరలేదు. ఇదే సూత్రం సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది. సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న హీరోల చుట్టూ నిర్మాతలు ప్రదక్షిణలు చేస్తుంటారు. అదే సమయంలో వరుస హిట్లు ఇస్తున్న దర్శకుల కోసం హీరోలు వెంపర్లాట ఆడుతుంటారు. ఒక అయినంత మాత్రాన ఆ దర్శకుడు హీరోలు టార్గెట్ చేయటం సహజంగా జరగదు. అయితే టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఒక దర్శకుడు విషయంలో లో మరి పగ తీర్చుకునే లా వ్యవహరించారన్న అయితే అప్పట్లో వినిపించింది. నాగార్జునతో భాయ్ అనే సినిమాను డైరెక్ట్ చేసిన వీరభద్రం చౌదరి.సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. అంతకు ముందు సునీల్ తో ఒక సినిమా హిట్ చేసి ఉండడంతో నాగార్జునను కన్విన్స్ చేసి బాయ్ సినిమాను డైరెక్ట్ చేసాడు.

 

 అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మించిన ఆ సినిమాలో రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తొలి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నాగార్జున ఆ సినిమాతో ఏకంగా 20 కోట్ల వరకు నష్టపోయాడు. ఇదంత ఒక ఎత్తు అయితే ఆ సినిమాతో అప్పటివరకూ నాగార్జున కు ఉన్న ఇమేజ్ పూర్తిగా అయింది. ఆ తర్వాత నాగార్జున ఒకటి రెండు సందర్భాల్లో బహిరంగ వేదికలమీద వీరభద్రం చౌదరి ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బాయ్ సినిమా ప్లాప్ తర్వాత వీరభద్రం చౌదరి కి ఒకటి రెండు అవకాశాలు వచ్చినా అవి కూడా ఫ్లాప్ అవడంతో పూర్తిగా తెరమరుగై పోయాడు. ఆ డైరెక్టర్ కు ఆ తర్వాత ఛాన్సులు రాక పోవడానికి కూడా పరోక్షంగా నాగార్జున కారణమన్న గుసగుసలు వున్నాయి .దీని పై అప్పట్లో రకరకాల చర్చలు కూడా నడిచాయి.


నాగార్జున లాంటి హీరో ఒక ఫ్లాట్ ఇచ్చినంత మాత్రాన ఒక డైరెక్టర్ ను ఎలా బహిరంగంగా టార్గెట్ చేయవచ్చా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. ఏదేమైనా బాయ్ సినిమా దెబ్బకు వీరభద్రం చౌదరి అడ్రస్ లేకుండా పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: