మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా టెక్నాలజీ పరంగా సినిమాలను అప్డేట్ చేస్తున్నారు. ఇదివరకు ప్రింటులు వచ్చే సినిమా ఇప్పుడంతా డిజిటల్ మయమైంది. ఇక రాను రాను మరింత అడ్వాన్స్ గా మారబోతుంది. ఇదిలాఉంటే సినిమాను థియేటర్ లోకి వచ్చే ఆడియెన్స్ సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. డిటిహెచ్, డిజిటల్ స్ట్రీమింగ్ ల మీద ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సినిమా బడ్జెట్ లో 30 పర్సెంట్ బిజినెస్ అవే ఇస్తున్నాయి. 

 

అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ ప్రస్తుతం ఈ మూడు డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. వీటిలో అమేజాన్ ప్రైమ్ ఫుల్ ఫాంలో ఉంది. అయితే లేటెస్ట్ గా అల్లు అరవింద్ కొంతమందితో కలిసి ఆహా ఓటిటిని మొదలుపెట్టారు. అర్జున్ సురవరం సినిమాతో పాటుగా మస్తి వెబ్ సీరీస్ కూడా అందులో అందుబాటులో ఉంది. అయితే సంక్రాంతి సూపర్ హిట్ మూవీ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాను నెట్ ఫ్లిక్స్ లోకి వదిలారు. అయితే ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కాబట్టి అహాలో వేసుంటే బాగుండేది అనిపించింది.  

 

మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉండే అల వైకుంఠపురములో బిజినెస్ పరంగా ఆలోచించి వాళ్లకు అమ్మేశారు కాని అదే సినిమా ఆహాలో ఉంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉండేదని అంటున్నారు. ఇక మీదట తెలుగులో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా ఆహాలో ఉంచాలని ఫిక్స్ అయ్యారు. వెబ్ సీరీస్ లకు కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. అహాలో అల మిస్సైనా వెబ్ సీరీస్ లతో బీభత్సం సృష్టించాలని ఫిక్స్ అయ్యారు.  అల వైకుంఠపురములో సినిమా ఆహాలో ఉంటే ఎక్కువ రీచింగ్ ఉండేది. లాచింగ్ ఒటిటి కాబట్టి సూపర్ క్రేజ్ తెచ్చుకునేది. కాని మంచి ఛాన్స్ మిస్ చేశారు అల్లు అరవింద్.    

మరింత సమాచారం తెలుసుకోండి: