టాలీవుడ్‌ ఇండస్ట్రీలో వివాదాలు కామన్‌. అయితే ఆ వివాదాలు ఒక్కోసారి చిలికి చిలికి గాలి వానగా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అవే వివాదాలు కొన్ని దశాబ్దాలపాటు అలాగే కొనసాగుతుంటాయి. అలాంటి వివాదామే చిరు రాజశేఖర్‌లది. వీరిద్దరి మధ్య ఉన్న అగాథం గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సందర్భంలో వీళ్ల గొడవ తారాస్థాయికి చేరింది. రెండు విమర్శలతో విరుచుకుపడ్డారు.

 

అయితే అసలు ఈ వివాదం ఎక్కడ ఎప్పుడు మొదలైందో ఓ సారి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సూపర్‌  హిట్‌ సినిమా ఠాగూర్‌. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమిళ సూపర్‌ హిట్ సినిమా రమణకు రీమేక్‌ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అవినీతి మీద ఓ సామాన్యుడు చేసే యుద్ధం నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఒరిజినల్‌ వర్షన్‌లో తమిళ స్టార్ హీరో విజయకాంత్ నటించగా మురుగదాస్ తెరకెక్కించాడు. ఇదే సినిమాను తెలుగు లో వినాయక్‌ దర్శకత్వంలో రీమేక్‌ చేశాడు చిరు.

 

అయితే ఈ సినిమా రీమేక్‌ హక్కులను తీసుకోవాలని తమిళ నిర్మాతలను ముందుగా రాజశేఖర్ సంప్రదించాడట. రాజశేఖర్‌ హీరోగా రీమేక్‌ పనులు ప్రారంభమవుతాయని అనుకుంటున్న తరుణంలో సడన్‌ సీన్‌లోకి ఎంటర్‌ అయిన అల్లు అరవింద్‌, తమిళ నిర్మాతలను ఒప్పించి రీమేక్ హక్కులు చిరుకు దక్కేలా చేశాడట. దీంతో రాజశేఖర్‌ చేయాల్సిన సినిమా మెగా క్యాంప్‌లో వచ్చి పడింది. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ కావాల్సిన సినిమా తనకు దూరం చేశాడన్న కారణంగానే రాజశేఖర్‌, చిరు మీద ధ్వేషం పెంచుకున్నాడని, ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే తరువాత చిరు స్యవంగా రాజశేఖర్‌ ఇంటికి వెళ్లి కలవటం, పలు వేదిక మీద చిరు, రాజశేఖర్‌లు కలిసినట్టుగా కనిపించినా అడపాదడపా వివాదం మాత్రం తెర మీదకు వస్తూనే ఉంది. తాజాగా మా అసోషియేషన్‌ లో జరిగిన గొడవ నేపథ్యంలోనూ చిరు vs రాజశేఖర్‌ వివాదం మరోసారి చర్చకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: