సంక్రాతి కి విడుదల అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరి లేరు నీకెవ్వరు మంచి హిట్ ని మహేష్ ఖాతా లో వేసింది. మహేష్ బాబు తెలుగు అగ్ర హీరోల లో ఒకరు. సూపర్ స్టార్ అని కూడా పేరు లోనే ఉంది పెద్దగా చెప్పడం అనవసరం. అయితే మహేష్ బాబు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమా ల లో వివిధ పాత్రలని పోషించాడు.
 
 
IHG
 
మురారి, ఒక్కడు, అతడు, నిజం ఇలా ఎన్నో సినిమాల లో అనేక పాత్రలని పోషించాడు ఈ హీరో. మహేష్ బాబు కి తెలుగు చిత్ర పరిశ్రమ పై ఎంతో అభిమానం ఉంది. టాలీవుడ్ లో పని చెయ్యడం తన ఉద్యోగం అని కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు పలు మార్లు అన్నాడు. అయితే మహేష్ బాబు కి టాలీవుడ్ సినిమాల లో నటించడం మాత్రమే ఇష్టం అని తెలిసిన విషయమే.
 
 
ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇలా పలు టాప్ హీరోస్ బాలివుడ్ లో సినిమాల పైన ఆసక్తి చూపిస్తున్నా మహేష్ బాబు మాత్రం వాటి పై మక్కువ చూపడం లేదు. అయితే అలా అని మహేష్ బాబు అక్కడ వారికి తెలియక పోవడము లేదు. ఎందుకంటే సూపర్ స్టార్ ధంప్స్ అప్ యాడ్ లో నటించడం తెలిసినదే. ఇలా బాలీవుడ్ ప్రేక్షకుల కి మహేష్ పరిచయమే.
 
IHG
 
 
కానీ రణ్ వీర్ సింగ్ తో పాటు కలిసి మల్టీ స్టారర్ మూవీ లో నటించమంటున్నాడు బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియాద్‌వాలా. రెమ్యునెరేషన్ ఎంతైనా ఇవ్వడనికి సిద్ధం కానీ సినిమా లో నటించాలని పట్టు పట్టాడు. కానీ ఎంతకీ సై అనడం లేదు సూపర్ స్టార్.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: