అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి పదేళ్లు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా  తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది.  సీనియర్ హీరోలతో పాటు మరోవైపు జూనియర్ హీరోల సరసన కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఇప్పటికి ఎంతో మంది కొత్త హీరోయిన్ల పోటీని ఇస్తూనే ఉంది కాజల్ అగర్వాల్. తనదైన అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తూ తన అందంతో ఎంతోమందికి చమటలు పట్టిస్తూ తన చిలిపి నవ్వుతోనే ఎంతో మంది  మనసులు కొల్లగొడుతూ  చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది ఈ అమ్మడు. అయితే మొన్నటి వరకు వరుస సినిమాలతో దూసుకుపోయిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మాత్రం అవకాశాలు తగ్గాయి అనే చెప్పాలి. కానీ ఫామ్ లో ఉన్నంత కాలం మాత్రం... ఒక రేంజ్ లో దూసుకుపోయింది ఈ అమ్మడు. 

 

 

 అయితే ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో తనదైన ప్రస్థానాన్ని కొనసాగించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు బిజినెస్ పైన కూడా దృష్టి మళ్ళిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంతో మంది హీరోయిన్లు వ్యాపార రంగంలో రాణిస్తున్న సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే కాజల్ కూడా బిజినెస్ విమెన్ గా  మారాలని భావించి... తొలి ప్రయత్నంగా ఇండీడ్ లో  భాగస్వామి అయింది. నిరుద్యోగుల పాలిట వరంగా మారిన ప్రఖ్యాత ఇండియన్ పోస్టల్ సేవలు నచ్చి కాజల్ పాప ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇందులో కాజల్ పెట్టుబడి ఎంత పెట్టింది అంటే... రూపాయి కూడా పెట్టలేదు కేవలం తన స్టార్ డమ్ నే  పెట్టుబడిగా పెడుతోందట ఈ అమ్మడు. తన బ్రాండింగ్ సాయం చేస్తోందట.తాజాగా ఇండీడ్ ను  ప్రమోట్ చేస్తూ తాజాగా ఓ ప్రకటనలో నటించింది కాజల్ అగర్వాల్. 

 

 

 మీకు ఉద్యోగం కావాలా ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాన్ని చూపించే ఏకైక  జాబ్ పోర్టల్ ఇండీడ్  అంటూ ఒక యాడ్ లో  నటిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ యాడ్లో కాజల్ పాపా మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు హీరోయిన్లందరూ జిమ్  సెంటర్ లు  పెట్టడం లేదా హోటళ్లను పెట్టడం చేస్తే కాజల్ అగర్వాల్ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించి ఇండీడ్ లో  భాగస్వామి అయినట్లు తెలుస్తోంది. మరి ఈ అమ్మడు ఎంతవరకు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి మరి. ఎందుకంటే ప్రస్తుతం ఇండియన్ కి పోటీగా ఎన్నో జాబ్ పోర్టల్స్  అందుబాటులో ఉన్నాయి. మరి కాజల్ స్టార్డం ఇండీడ్  హోటల్ కి ఎంత గా ఉపయోగపడుతుంది అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: