ఈ ప్రపంచంలో మనకంటూ నిజంగా ఎప్పుడూ తోడుండేది తోబుట్టువులే. రక్తం పంచుకుపుట్టిన వాళ్ల అనుబంధం రక్త సంబంధం. దాన్ని మించిన బంధం ఉండుదు. విచిత్రం ఏంటంటే.. పెళ్లికి ముందు వరకూ ఎంతో ప్రేమగా ఉన్న అన్న, తమ్ముడు, అక్క.. ఇలాంటి వారంతా పెళ్లి తర్వాత చాలా వరకూ మారిపోతారు. ఆస్తుల గొడవలో, మాట పట్టింపులో ఏవో గొడవలు తప్పకుండా వస్తూనే ఉంటాయి. కానీ కొంత మంది మాత్రం అరుదుగా ఉంటారు.

 

 

పెళ్లయినా ఎన్ని కొత్త బంధాలు వచ్చినా.. తోబుట్టువులను మాత్రం ప్రాణంగా చూసుకుంటారు. ఇందుకు అచ్చమైన ఉదాహరణ హీరో సాయి కుమార్. నటుడు అయ్యప్ప శర్మ కడుపున పుట్టిన వారంతా చక్కటి కంఠ స్వరంతో డబ్బింగ్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. ఇక సాయికుమార్ వంటి వారు డబ్బింగ్ తో పాటు సినీ హీరోగా కూడా రాణించారు. సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అన్న సాయి కుమార్ గురించి చెప్పిన మాటలు వింటే.. ఇలాంటి ఫ్యామిలీలో మనం ఉంటే ఎంత బావుంటుంది అనిపిస్తుంది.

 

 

తన అన్న సాయికుమార్ గురించి యాంకర్ అడిగితే.. మా అన్న ఓ దేవుడు. ఆయన వల్లే మేం ఈ స్థాయిలో ఉన్నాం అని చెప్పాడు. అంత వరకూ ఓకే.. కానీ ఆయన చెప్పిన మరో మాట మన హృదయాలను కదిలిస్తుంది. మా అన్న ఎంత దేవుడో.. మా వదిన అంత కంటే డబుల్.. మా వదినకు హ్యాట్సాఫ్ అని చెబుతున్నప్పుడు.. సాయి కుమార్ దంపతులు గొప్పదనం ఏంటో తెలుస్తుంది.

 

 

పెళ్లి కాగానే వేరు కుటుంబం పెట్టేసి.. మొగుడుని కొంగుకు కట్టేసుకునే అమ్మాయిలు ఎందరో ఉన్నారు. నేను, నా మొగుడు, నా పిల్లలు అని గిరి గీసుకోకుండా..ఇలా మరుదులను కొడుకులుగా భావించే వదినమ్మలు ఎందరు ఉంటారు. అలాంటి వదినలందరికీ ఓ సలాం. ఇంటికి పెద్ద కొడుకు ఎంత బాధ్యతగా ఉండాలో.. ఉంటే.. దాని ఫలాలు ఎంత తీయగా ఉంటాయో సాయి కుమార్ ఫ్యామిలీని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: