హీరోయిన్ మూడు పదుల వయసు వరకు రాణించడం అనేది చాలా కష్టం. హీరోలు అయితే 70 వరకు ఫాం లో ఉండవచ్చు గాని హీరోయిన్లు మాత్రం 30 ఏళ్ళ వరకు కష్టమే. ప్రస్తుతం 30 ఏళ్ళు దాటిన హీరోయిన్లు మన తెలుగు, పక్కన ఉన్న తమిళ పరిశ్రమలో చాలా తక్కువగా ఉన్నారు. వరుస ఆఫర్లతో కొందరు స్టార్ హీరోయిన్లు దూసుకుపోతున్నారు. ఫిట్నెస్ కాపాడుకుంటూనే వాళ్ళు సినిమాలు సినిమాలు చేస్తున్నారు. అందుకోసం భారీగానే వసూలు చేస్తున్నారు. కాజల్, అనుష్క ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. 

 

ప్రస్తుతం అనుష్క పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి ఈ వార్తలు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 40 ఏళ్ళ వయసులో కూడా ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి ఆమెకు తీవ్రంగా ఒత్తిడి ఉందని టాక్ వినపడుతుంది. దీనితోనే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెకు పెళ్లి కూడా కుదిరింది అంటున్నారు. అందంతో పాటు అభినయం కూడా నాలుగు పదుల వయసులో కూడా ఆమెకు ఎక్కడా తగ్గలేదు. 

 

దీనితో ఆఫర్లు వస్తున్నాయి కూడా. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక సినిమాల నుంచి తప్పుకుంటే మంచిది అని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. తన విలువ తగ్గకముందే తప్పుకుంటే ఏ గొడవ ఉండదు అని భావిస్తుంది అనుష్క. తనను ఇంకా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, ఇప్పుడు కొత్త హీరోయిన్లు వస్తున్నారని, వారికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి, ఇక చాలు అనుకుంటుంది ఆమె. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఆమె నుంచి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనేది స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: