సినిమా ఇండస్ట్రీ ఎవరినైనా పైన కూర్చోబెడుతుంది. ఒక్కసారిగా కింద పడేస్తుంది. టాలెంట్ చూపించాలనే గానీ.. ముక్కూ మొహం తెలియని దర్శకులను స్టార్స్ ను చేసేస్తుంది. ఒకటి రెండు సినిమాలలో తామేమిటో నిరూపించుకుంటే చాలు.. పెద్ద హీరోలు పిలిచి మరీ ఛాన్సులిస్తారు. 

 

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ అశ్విన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నానితో తీసిన ఈ సినిమా దర్శకుడికి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని తీసిన మహానటి ఘన విజయం సాధించింది. మహానటి జీవిత చరిత్రను నాగశౌర్య ఎలా డీల్ చేస్తాడన్న అనుమానం చాలామందిలో ఉండేది. పెద్దగా అనుభవం లేని కొత్త దర్శకుడు. అలనాటి నటిని హ్యాండిల్ ఎలా చేస్తాడనుకుంటే.. ఎలాంటి  అంచనాల్లేకుండానే వచ్చి ఇంప్రెస్ చేశాడు నాగశౌర్య.

 

మహానటి విజయం తర్వాత నాగశౌర్య తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తాడన్న ఆసక్తి నెలకొంది. ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మహానటిలో నాగశౌర్య చూపించిన ప్రతిభ.. సినిమా సక్సెస్ ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ప్రస్తుతం మన దర్శకులు పాన్ ఇండియా కథలను రాసుకుంటే.. ప్రభాస్ కోసం పాన్ వరల్డ్ కథతో వస్తున్నాడని చెప్పాడు నాగశౌర్య. ఈ భారీ ప్రాజెక్ట్ ను సమ్మర్ లోమొదలుపెట్టి.. 2021 డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు నిర్మాత అశ్వనీదత్. 

 

రెండు సినిమాలతో బంపర్ ఆఫర్ కొట్టేసిన మరో దర్శకుడు వేణు శ్రీరామ్. సిద్ధార్ధ, శృతిహాసన్ జంటగా నటించిన ఓ మై ఫ్రెండ్ మూవీతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టాడు. డెబ్యూ మూవీ నిరాశపరిచేసరికి ఆరేళ్లు కనిపించని వేణు శ్రీరామ్ ఎంసీఏతో హిట్ అందుకున్నాడు. మూడో సిినిమాకే పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. పవన్ గ్యాప్ తీసుకొని నటిస్తున్న పింక్ రీమేక్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: