టాలీవుడ్ హిస్ట‌రీలో మ‌రో నెల విజ‌య‌వంతంగా ముగిసింది. సంక్రాంతి నేప‌థ్యంలో జ‌న‌వ‌రిలో థియేట‌ర్లు అన్ని మంచి సినిమాలు.. హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడాయి. అల వైకుంఠ‌పుర‌ములో, స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో బాక్సాఫీస్ అంతా జ‌న‌వ‌రిలో హౌస్‌ఫుల్ అయ్యింది. ఇక ఫిబ్ర‌వ‌రిలో నాలుగు శుక్ర‌వారాల్లో నాలుగు అంచ‌నాలు ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. శ‌ర్వానంద్ - స‌మంత జాను, విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, నితిన్ - ర‌ష్మిక భీష్మ‌తో పాటు చివ‌రి శుక్ర‌వారం నాని నిర్మాత‌గా విశ్వ‌క్‌సేన్ హీరోగా వ‌చ్చిన హిట్ మూవీ వ‌చ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో ఏది ఫిబ్ర‌వ‌రి బెస్ట్ సినిమాయో ?  ఏపీ హెరాల్డ్ అవార్డు ఏ సినిమాకు వ‌చ్చిందో చూద్దాం.



ముందుగా ఈ నాలుగు సినిమాల‌ను విశ్లేషిస్తే త‌మిళ్‌లో 96 పేరుతో తెర‌కెక్కి హిట్ అయిన ఈ సినిమా తెలుగులో స‌మంత‌, శ‌ర్వానంద్ జంట‌గా జాను పేరుతో తెర‌కెక్కింది. మంచి ఎమోష‌న‌ల్ ల‌వ్ జ‌ర్నీగా మిగిలింది. ప్రేమకథల్ని ఇష్టపడేవాళ్లకు.. ఫీలయ్యే వాళ్లకు జాను ఒక మంచి జ్ఞాపకంగా నిలుస్తుంది. అయితే క‌థ‌నం చాలా చోట్ల మ‌రీ స్లో అవ్వ‌డంతో పాటు ఈ సినిమాను 90 ల‌వ్ స్టోరీల త‌ర‌హాలో చూపించ‌డం.. అంద‌రికి క‌నెక్ట్ కాక‌పోవ‌డం.. ఒరిజిన‌ల్ ఫీల్ మిస్ కావ‌డంతో క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేదు.



ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాలో న‌లుగురు హీరోయిన్లు ఉన్నా సినిమా యూత్‌కు కూడా క‌నెక్ట్ కాలేదు. న‌లుగురు హీరోయిన్లు ఉన్నా... అర్జున్‌రెడ్డి త‌ర‌హాలో మ‌ళ్లీ క‌థ రిపీట్ చేస్తే ప్ర‌జ‌లు సినిమాలు చూస్తార‌న్న భ్ర‌మ‌ల్లో ఉన్న విజ‌య్‌కు ఈ సినిమా పెద్ద షాక్ ఇవ్వ‌డంతో పాటు విజ‌య్‌కు వ‌రుస‌గా నాలుగో డిజాస్ట‌ర్ ఇచ్చింది. ఇక మూడో వారంలో మ‌హాశివ‌రాత్రి కానుక‌గా వ‌చ్చిన నితిన్ - ర‌ష్మిక భీష్మ తొలి ఆట నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. తొలి వారానికే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వ‌చ్చేసింది.



ఇక చివ‌రి వారంలో నాని నిర్మాత‌గా విశ్వ‌క్‌సేన్ హీరోగా వ‌చ్చిన హిట్ సినిమా థ్రిల్ల‌ర్ జాన‌ర్ ప్రియుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు డాక్ట‌ర్ శైలేష్‌ పూర్తిగా జానర్ కు కట్టుబడి సిన్సియర్ గా సినిమాను నడిపించిన నేపథ్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్.. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో ?  చూడాలి.



ఓవ‌రాల్‌గా ఈ నాలుగు సినిమాల్లో జాను, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌ను పూర్తిగా ప‌క్క‌న పెడితే ఇండియా హెరాల్డ్ ఫిబ్ర‌వ‌రి 2020 బెస్ట్ మూవీ అవార్డు భీష్మ‌కే ద‌క్కుతుంది. ఇక ఈ సినిమా థియేటర్లో ఉన్నంతసేపూ ప్రేక్షకుడిని కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ డోస్ మాత్రం ఇస్తుంది. ఈ నెల‌లో వ‌చ్చిన సినిమాల‌న్నింటిలోకి ఫ్యామిలీతో స‌హా వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా.. అటు ప్రేమికుల‌ను... ఇటు ఫ్యామిలీస్‌ను చ‌క్క‌గా ఎంట‌ర్టైన్ చేస్తుంది. అందుకే భీష్మ‌కు ఇండియా హెరాల్డ్ ఫిబ్ర‌వ‌రి బెస్ట్ మూవీ అవార్డుతో స‌త్క‌రిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: