రాం చరణ్ సినిమాలలోకి వచ్చాక మెగా పవర్ స్టార్ రాం చరణ్ అన్న ట్యాగ్ ని అభిమానులు ఇచ్చేలా చేసుకున్నాడు. మొదటి సినిమా చిరుత సినిమా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కింది. మొదటి సినిమాతోనే చరణ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవుతాడని అందరి నోటా అనిపించుకున్నాడు. అయితే అలా అనిపించుకోవడం వేరు అది సాధించడం వేరు. నటన పరంగా చరణ్ లో హై ఓల్టేజ్ ఉందని చిరుత సినిమాతో నిరూపించాడు.

 

సాధారణంగా వారసత్వం అనేది ఒక సినిమాకే పనికొస్తుంది. ఎంత పెద్ద స్టార్ వారసులైనా మొదటి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనంతవరకే. ఆ తర్వాత తన టాలెంట్ తోనే స్టార్ ఇమేజ్ ని సాధించుకోవాలి. అయితే చరణ్ అది రెండవ సినిమాతో సాధించేశాడు అని చెప్పాలి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు ఈ సినిమాతో రాం చరణ్ మెగా పవర్ స్టార్ అయిపోయాడు.

 

అయితే మగధీర సినిమా నుండి చరణ్ కంప్లీట్ గా తన సొంత నిర్ణయాలమీదే సినిమా కథలని విని సెలెక్ట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఒకరకంగా ఈ విషయంలో చరణ్ కి తండ్రి చిరంజీవి ఆదర్శం అని చెప్పాలి. చిరంజీవి తన కెరీర్ మొదట్లో సినిమా కథ లని సొంతగా ఎంచుకునేవారు. ఆ సమయంలో ఆయనకి ఎవరూ సపోర్ట్ లేరు. అన్నీ కష్టాలు ఆయనే పడ్డారు. అన్నిటికీ ఎదురీది నిలబడ్డారు.

 

ఇప్పుడు మెగాస్టార్ కి కొడుకైనా ఈ విషయంలో చరణ్ సొంతంగా తన కెరీర్ ని కొనసాగిస్తుండటం నిజంగా గొప్ప విషయం. ఇక ఫ్యాన్స్ ని శాటిస్‌ఫై చేయడంలోను స్క్రీన్ అప్పీరియన్స్ లోను డాన్స్, ఫైట్స్ ..ఒకటేమిటి జనాలకి సహాయం చేయడం దగ్గర్నుంచి కుటుంబాన్ని బాధ్యతగా చూసుకునే వరకూ అన్ని చిరంజీవి లక్షణాలే చరణ్ లో సష్టంగా కనిపిస్తాయి. అందుకే చరణ్ ని ఎవరు చూసినా తండ్రికి తగ్గ తనయుడు అంటారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: