అబ్బబ్బా.. ఈ బుల్లితెర నటుల జీవితం బాగుంది.. హీరోయిన్స్ గా నటించిన వారు కూడా కొనలేని.. చెయ్యలేని పనులు చేసి షాకులు మీద షాకులు ఇస్తున్నారు ఈ బుల్లితెర నటులు. మొన్న ఈ మధ్యే హరితేజ కూడా అదిరిపోయే కారును.. ఫ్లాట్ ను కొనింది. ఇప్పుడు ఈ వంటలక్క కూడా ఖరీదైన బెంజ్ కారు.. దానికి తోడు ఫ్యాన్సీ నెంబర్‌‌కు భారీ రేటు పెట్టింది అంటే వంటలక్క రేంజ్.. ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవాలి. 

 

వంటలక్క ఎవరు అనుకుంటున్నారా? మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది లెండి.. ఆమె నండి రాత్రి 7:30 నిముషాలు అయ్యింది అంటే చాలు ప్రతి ఇంట్లో టీవిలో ఆమె బొమ్మ కనబడుతుంది. అదే కార్తీక దీపం సీరియల్ అండి. ఆ సీరియ‌ల్‌లో మహానటిగా నటించి ఆమె నటనతో అందరితో కన్నీళ్లు పెట్టించే నల్ల దీప అలియాస్ వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్. 

 

ఈ సీరియల్ 700 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది అంటే నమ్మండి.. దానికి కారణం బుల్లితెర మహానటి ప్రేమి విశ్వానాథ్ అనే చెప్పాలి. ఇక ఈమె ఫాలోయింగ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈమె పేరు మీద అదే వంటలక్క పేరు మీద టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్ ను పెట్టేశారు అభిమానులు. 

 

అంతేకాదు.. పండుగ వచ్చింది అంటే చాలు ఈమె ఫ్లెక్సీ ని కట్టిస్తున్నారు. వంటలక్క వీరాభిమానులందరికి పండుగ శుభాకాంక్షలు అని. ఇక ఈ నేపథ్యంలోనే వంటలక్క కూడా తన అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. తన షూటింగ్ అప్డేట్స్‌తో పర్శనల్ విషయాలను ఫేస్ బుక్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఖరీదైన బెంజ్ కారు కొన్న విషయాన్నీ కూడా వంటలక్క షేర్ చేసింది. ఆ కారు ఫోటోలను షేర్ చేసింది. 

 

సుమారు 60 లక్షలు విలువైన బెంజ్ SUV కారుని కొనింది వంటలక్క. అంతేకాదు... వంటలక్క లక్కీ నెంబర్ 6 కావడంతో 3444 టోటల్ 6 వచ్చేలా ఫ్యాన్సీ నంబర్ తీసుకుంది వంటలక్క. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మా వంటలక్క బెంజ్ కారు కొనింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: