సినిమాల్లో కొంత మంది ప్రముఖులను చంపేందుకు సుపారీ ఇచ్చి వారిని చంపించేందుకు ప్లాన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ చేతికి మట్టి అంటదన్న ఉద్దేశం.  ఇది రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది.  తమకు గిట్టని వారిని, శత్రువులను చంపేందుకు కొంత మంది రౌడీ షీటర్స్ ని డబ్బు ఇచ్చి చంపిస్తుంటారు.  తాజాగా కన్నడ నాట వరుస హిట్స్ తో దూసుకు వెళ్తున్న యంగ్ క్రేజీ హీరో యష్ ఆ మద్య ‘కేజీఎఫ్’ తో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు.  అయితే గతంలో యష్ పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం యష్ అభిమానులంతా కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. 

 

హీరో యష్  గత ఏడాది మార్చిలో జరిగిన కొన్ని సంఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. భరత్ అలియాజ్  స్లమ్ భరత్ అనే రౌడీ మోస్ట్ డెంజరస్ రౌడీ షీటర్ గత ఏడాది యష్ హత్యకు ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. భరత్ పై మర్డర్ కేసు, ఇతర వ్యవహారాల్లో మొత్తం 50 పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొంత కాలంగా భరత్ పరారీలో ఉన్నారు. ఇతను సుపారీ తీసుకొని హత్యలు చేయడంలో దిట్ట అంటున్నారు.  అయితే యష్ లాంటి హీరోని చంపడం అంత సులువైన విషయం కాదు.. భరత్ పక్కా ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తుంది.

 

ఇటీవలే భరత్ ని ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసి పోలీసులు కర్ణాటనకు తీసుకువచ్చారు. సీన్ రీ కంస్ట్రక్షన్  చేస్తున్న సమయంలో పోలీసులపై భరత్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భరత్పోలీస్ పై కాల్పులు  జరిపాడు.. కానీ అతడు బుల్లెట్ ప్రూఫ్ దరించడంతో అది వెళ్లి వ్యాన్ కి తగిలింది.  అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని ఛేజ్ చేసి  కాల్పులు జరిపారు. ఆ సమయంలో అతని పొత్తి కడుపులోకి బుల్లెట్ దిగింది. మెరుగైన చికిత్స కోసం సప్తగిరి ఆసుపత్రి నుంచి విక్టోరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. పరిస్థితి విషమించి అతడు చనిపోయినట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: