ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు, దర్బార్, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా మూవీస్ రిలీజ్ అయ్యాయి.  ఇందులో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.  అయితే దర్బార్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కలెక్షన్లు సాధించలేదు.  ఇక కళ్యాన్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా డిజాస్టర్ అయ్యింది.  ఇక తమిళ, కన్నడలో సూపర్ హిట్ అయిన 96 మూవీ బిగ్గెస్ట్ హిట్ గా  నిలిచాయి.  అయితే తెలుగు లో దిల్ రాజు బ్యానర్ లో శర్వానంద్, సమంత జంటగా నటించిన ‘జాను’ తెలుగు లో మాత్రం భారీ డిజాస్టర్ బా మిగిలింది.  వాస్తవానికి ఈ మూవీలో ఇద్దరి నటనకు మంచి మార్కులు పడ్డప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం హిట్ సాధించలేకపోయింది. 

 

వరుసగా సమంత విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.  చాలా కాలం తర్వా సమంత ఒక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  ఇక శర్వానంద్ కి శతమానం భవతి తర్వాత వరుసగా డిజాస్టర్స్ అందుకుంటున్నాడు.  జాను పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈ మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిపోయింది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'జాను' సినిమా మిక్సుడ్ టాక్ తెచ్చుకొని తో ప్లాప్ కలెక్షన్స్ తో బిజినెస్ క్లోజ్ చేసుకుంది. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రీ-రిలీజ్ బిజినెస్‌ కింద 21 కోట్లు వస్తే.. చివరికి ఈ మూవీ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో 6.93 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 8.18 కోట్ల వాటా వసూలు చేసి భారీ డిజాస్టర్ లిస్ట్ లో చేరింది. 

 

మొదటి నుంచి 96 మూవీ చూసినప్పటి నుంచి దిల్ రాజు ఈ మూవీ రిమేక్ చేయాలని తపనతో ఉన్నాడు.  అయితే హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేదంటున్నారు దిల్ రాజు.  ఇక ఫ్లాప్ విషయంపై స్పందించిన సమంత తనకు ఈ మూవీ ఎంతో నచ్చిందని.. ఇష్టపడే ఈ పాత్రలో నటించాడను.. ఫలితం పై తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: