ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన నటుడు సునీల్ ప్రస్తుతం ఒకటి అరా చిత్రాల్లోనే కనిపిస్తున్నాడు. కమెడియన్ గా ఉన్నప్పుడు దాదాపు తెలుగులో రిలీజ్ అయ్యే అన్ని సినిమాల్లో కనిపించేవాడు. కొన్ని కొన్ని సార్లు సినిమా యావరేజ్ గా ఉన్నా సునీల్ కామెడీ మాత్రం పేలిపోయేది. అలా సినిమా యావరేజిగా ఉండి సునీల్ కామెడీ అదిరిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి.

 

 

అయితే ఏ ముహూర్తాన సునీల్ హీరోగా మారాడో కానీ అప్పటి నుండి అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు వంటి సినిమాలతో సక్సెస్ అయినా కూడా తర్వాత మెల్లగా యాక్షన్ బాట పట్టడంతో కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. అలా డౌన్ అవుతూ అవుతూ పూర్తిగా కనిపించకుండా పోయాడు. అయితే గత కొన్ని రోజుల నుండి మళ్ళీ కామెడీ రోల్స్ చేద్దామని ట్రై చేస్తున్నాడు.

 

 

కానీ సునీల్ ఖాళీ చేసిన స్థానంలో చాలామంది రావడంతో ఇప్పుడు అతడిని కమెడియన్ గా గుర్తించట్లేదు. అందువల్ల మళ్ళీ తన రూటు మార్చి విలన్ గా రాబోతున్నాడు. డిస్కోరాజా సినిమాలో చివర్లో విలనిజం పండించినా దానికి పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం సునీల్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న కలర్ ఫోటో అనే సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

 

 

విలన్ గా సునీల్ లుక్ పర్ ఫెక్ట్ గా ఉంది. రామరాజు అనే పేరుతో సునీల్ పండించే విలనిజం మరో రేంజ్ లో ఉందని చెబుతున్నారు దర్సకుడు సందీప్ రాజ్. కమెడియన్ నుండి హీరోగా మారి, హీరో నుండి విలన్ గా మారిన సునీల్ కి కలర్ ఫోటో ద్వారానైనా హిట్ వస్తుందా లేదా చూడాలి సుహాస్  హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కొబ్బరిమట్ట సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సాయి రాజేష్ నీలం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: