ఒక్కోసారి సినిమాలు ట్రెండ్ కు తగ్గట్టుగా వస్తూంటాయి. కొన్ని సినిమాలు మాత్రం ట్రెండ్ క్రియేట్ చేస్తూంటాయి. హీరోలందరూ కొన్నేళ్ల పాటు అదే జోనర్ ఫాలో అవుతూంటాయి. ప్రస్తుతం తెలుగులో వస్తున్న రెండు సినిమాలు కొత్త జోనర్ లో రాబోతున్నాయి. విశేషమేమంటే రెండు సినిమాల కథలు కూడా ఒకే ప్లాట్ తో సిద్ధమవడం. ఈ రెండు సినిమాల హీరోల్లో ఒకరు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అయితే.. మరొకరు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

 

 

వీరిద్దరూ బాక్సింగ్ నేపథ్యమున్న సినిమాలు చేయడమే ఇప్పుడు విశేషంగా మారింది. విజయ్ దేవరకొండ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరక్టర్ పూరి జగన్నాధ్ డైరక్ట్ చేస్తుంటే.. వరుణ్ తేజ్ సినిమాను డెబ్యూ డైరక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ కు వరుణ్ కు కూడా ఈ సినిమాలు తమ కెరీర్ లో 10వ సినిమానే కావడం యాధృచ్చికం. విజయ్ దేవరకొండ బాక్సింగ్ కోచింగ్ తీసుకుని ఈ సినిమా కోసం తయారయ్యాడు. వరుణ్ తేజ్ ఏకంగా విదేశాల్లో బాక్సింగ్ కోసం కఠోర శిక్షణ తీసుకున్నాడు. ఒలింపిక్ మెడలిస్ట్ టోనీ జెఫ్రీస్, ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయత్ వద్ద శిక్షణ తీసుకున్నాడు.

 

 

విజయ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమాను పూరి జగన్నాధ్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. కరణ్ జోహార్నిర్మాత కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ సినిమా భారీగా తెరకెక్కిస్తున్నాడు నిర్మాత అల్లు బాబీ. మెగా హీరోల్లో వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ విభిన్నమైన స్క్రిప్ట్స్ చేస్తూ వరుస సక్సెస్ ల్లో ఉన్నాడు. దీంతో వరుణ్ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంటుందా.. లేదా అనేది చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: