కుర్ర హీరో విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమా నిన్న విడుదలై మిక్సిడ్ అభిప్రాయాలను పొందుతుంది. చాలామంది ప్రేక్షకులు ఈ థ్రిల్లర్ సినిమాని ఒక్కసారి చూడవచ్చని చెబుతున్నారు. సక్సెస్ ఫుల్ హీరో నాని ఈ సినిమాని తన సొంతంగా నిర్మించాడు. తాను ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా చేస్తే తన స్టార్డం తగ్గిపోతుందనే ఉద్దేశంతో కథ నచ్చినా విశ్వక్ సేన్ ని ఏరికోరి మరీ ఈ సినిమాలో హీరోగా నటింపజేసాడు. విశ్వక్ సేన్ తన పాత్రలో ఒదిగిపోయి అందరి మన్నలను పొందుతూ ఉన్నాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్టు బ్లాక్ బాస్టర్ హిట్ కాకపోయినా... శీర్షికకు తగినట్టుగా హిట్ అనే టాక్ ని దాదాపుగా సంపాదించింది.




అయితే హిట్ సినిమా నిర్మాత హీరో నాని సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక మీడియా సమావేశంలో పాల్గొని ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. డైరెక్టర్ శైలేష్ చెప్పిన కథ నచ్చి... కేవలం 49 రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేసి హిట్ సినిమాను వెండి తెరకెక్కించామని హీరో నాని చెప్పుకొచ్చారు. ఈ సినిమాని 7 సార్లు చూసినా ఇంకా ఈ సినిమాపై తనకి బోర్ కొట్ట లేదని గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఈ సినిమాకి అనవసరంగా హిట్ అని టైటిల్ పెట్టి పెద్ద తప్పు చేశామని అన్నారు. దీంతో అక్కడ ఉన్న వారంతా నాని ఏం చెప్పబోతున్నారో అనుకుంటూ నోరెళ్లబెట్టారు. కానీ హీరో నాని నవ్వుతూ... ఈ సినిమాకి సూపర్ హిట్ అనే టైటిల్ పెట్టాల్సింది అంటూ చమత్కరించాడు. ఇది వినగానే అక్కడున్నవారంతా పకపకా నవ్వారు.

 

 

ఏదేమైనా తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రతిభావంతులైన నటి నటిమణులకు సినీ అవకాశాలు కల్పించేందుకు తాను కృషి కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే తాను సొంతంగా నిర్మించిన హిట్ సినిమాలోని త్రిల్లర్ పాయింట్స్ ని ఎవరు బయట పెట్టకూడదని సినిమా చూసిన వారందరికి విజ్ఞప్తి చేశాడు. ఏదేమైనా ఒకవైపు హీరోగా హిట్టులను సాధిస్తూ మరో వైపు నిర్మాతగా కూడా హిట్టు సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు మన హీరో నాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: