టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల తర్వాత ‘అజ్ఞాతవాసి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  కానీ ఈ మూవీ ఫస్టాఫ్ బాగున్నా సెకండఫ్ పరమబోర్ అని ప్రేక్షకులు తిరస్కరించారు.  ఈ మూవీ ఫ్లాప్ టాక్ తర్వాత పవన్ కళ్యాన్ ఏపిలో జరిగిన రాజకీయాల్లో బిజీ అయ్యారు.  ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు.  ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. సినిమాల్లో నటించేందుకు సిద్దమయ్యారు.  ఈ నేపథ్యంలో ఆయన బాలీవుడ్ లో అమితాబ్ నటించిన ‘పింక్’ రిమేక్ లో నటిస్తున్నారు.

 

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో  పవన్ నటిస్తున్న ‘పింక్’ రిమేక్ అఫిషియల్ గా టైటిల్ ఫిక్స్ చేయలేదు.  కానీ వకీల్ సాబ్ అని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ మూవీ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  పవన్‌కల్యాణ్‌ 26వ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ మూవీ అప్ డేట్స్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్   తమన్‌.. ‘PSPK26FirstSingle’ను త్వరలోనే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు.

 

ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులు పవన్‌ ఫస్ట్‌లుక్‌ గురించి సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మార్చి 2 పవన్‌ సినిమా ఫస్ట్‌లుక్‌, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఫస్ట్‌సాంగ్‌ను విడుదల చేయనున్నారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఈ మూవీ పై ఇటు దర్శకుడు.. పవన్ కళ్యాన్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అజ్ఞాతవాసి లాంటి మూవీతో డిజాస్టర్ పొందిన పవన్ ఈసారి మంచి హిట్ కొడతానన్న నమ్మకంలో ఉన్నారు.  ప్రస్తుతం ఈ సినిమాకి ‘వకీల్‌సాబ్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: