ఈ యేడాది ఇప్ప‌టికే జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌లు ముగిసిపోయాయి. రేపు ఆదివారం నుంచి మూడో నెల మార్చి ఎంట‌ర్ అవుతోంది. ఈ రెండు నెల‌ల్లో బాక్సాఫీస్ రిజ‌ల్ట్ చూస్తే జ‌న‌వ‌రి నెల‌లో సంక్రాంతి సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాయి. సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. 

 

ఈ నాలుగు సినిమాల్లో మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు, అల్లు అర్జున్ అల వైకుంఠపుర‌ములో రెండు సినిమాలు సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వడంతో పాటు ఏకంగా రు. 200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టాయి. ఇక సంక్రాంతికే వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ - మురుగ‌దాస్ ద‌ర్బార్ డిజాస్ట‌ర్ అయ్యింది. క‌ళ్యాణ్ రామ్ శ‌త‌మానం భ‌వతి మ్యాజిక్ రిపీట్ చేస్తాడ‌నుకుంటే ఘోర‌మైన ప్లాప్ ఇచ్చాడు. ఇదే అదే నెల చివ‌ర్లో వ‌చ్చిన ర‌వితేజ డిస్కోరాజా సైతం ప్లాప్ అయ్యింది.

 

ఇక ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌తి శుక్ర‌వారం ఓ సినిమా రిలీజ్ అయ్యింది. 7వ తేదీన వ‌చ్చిన శ‌ర్వానంద్ - స‌మంత జాను మంచి సినిమాగా ప్రశంస‌లు అందుకున్నా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఇక మ‌రుస‌టి శుక్ర‌వారం వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాతో విజ‌య్ వ‌రుస‌గా నాలుగో ప్లాప్ కొట్టాడు. ఇక మూడో వారం శివ‌రాత్రి కానుక‌గా వ‌చ్చిన భీష్మ కేవ‌లం తొలి వారం ముగిసే స‌రికే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల భాట‌లోకి వ‌చ్చేసింది.

 

భీష్మ సినిమాతో నితిన్ కెరీర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టేశాడు. ఈ సినిమాతో నితిన్ హిట్ క‌రువు తీరిపోయింది. ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికే ఈ సినిమా రు. 50 కోట్ల వ‌సూళ్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాతో నితిన్ సంబ‌రాలు స్టార్ట్ చేసేశాడు. చివ‌రి వారంలో వ‌చ్చిన విశ్వ‌క్ సేన్ హిట్ టాక్ తో తొలి రోజు రు 1.4 కోట్ల షేర్ రాబ‌ట్టింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: