తెలుగు ఇండస్ట్రీలో సరైనోడు, దువ్వాడ జగన్నాథం తర్వాత నివాస్ దర్శకత్వంలో నాపేరు సూర్య చిత్రంతో బారీ డిజాస్టర్ పొందిన అల్లు అర్జున రెండేళ్లు విరామం తీసుకున్నాడు. ఈసారి వస్తే బ్లాక్ బస్టర్ తోనే అంటూ రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ తో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనుకున్నట్టు గానే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అల వైకుంఠపురంలో సినిమా నైజాం, వైజాగ్ , కృష్ణ , వెస్ట్ , సీడెడ్ , గుంటూరు , నెల్లూరు వంటి ఏరియాల్లో నాన్ బాహబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రం రిలీజ్ కి ముందే సామ జవరగమన, రాములో రాముల సాంగ్స్ యూట్యూబ్ లో సంచలన రికార్డులు క్రియేట్ చేశాయి. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అల వైకుంఠపురం లో సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అల.. వైకుంఠపురములో' చిత్రం ఘనవిజయం సాధించిన జోష్లో ఉన్న అల్లు అర్జున్ కొన్ని రోజులుగా కొత్త లుక్లో కనపడుతూ తన అభిమానుల్లో మరింత జోష్ నింపుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారట. ఒక పాత్ర పూర్తిగా నెగిటీవ్ షేడ్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఇందులో బన్నీ సరసన రష్మిక నటిస్తుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం ఆయన కొత్త గెటప్ కోసం ప్రయత్నిస్తున్నాడు. సుకుమార్ తన చిత్రంలో హీరోలను డిఫరెంట్ లుక్ లో ప్రజెంట్ చేస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. తాజాగా మంకీ క్యాప్, గడ్డంతో ఆయన కనపడ్డాడు. ఈ సారి బ్లాక్ డ్రెస్లో కనపడ్డ ఆయన లుక్ చూసి అభిమానుల్లో కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఈ ఫొటోలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Finally my dream comes true...
— Allu Prashanth (@Alluprashanth9) February 28, 2020
Met my #Hero @alluarjun Anna on the occasion of My Birthday ...🥰#Thanks for wishing me anna. love uuuuuu Anna and🥰 Tnq @imsarathchandra Anna @IamVenkateshRam Anna😍😍😍
#AlluArjunArmy 🥰🥰 pic.twitter.com/lEAVNA4M3D
#AlluArjunArmy Slogans 🔥🔥
— Dharavath Santhosh (@Santhosh_777) February 28, 2020
Love you @alluarjun ❤ pic.twitter.com/5p7swahTQL