తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి సొంత టాలెంట్ తో అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం ప్రేక్షకులు మాస్ మహారాజ్ గా మారిపోయాడు రవితేజ. తనదైన యాక్షన్ తో కామెడీ టైమింగ్ తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే గతంలో వరుస విజయాలతో దూసుకుపోయిన  రవితేజ.. రాజా ది గ్రేట్ తర్వాత సరైన హిట్ లేక వరుసగా విఫలమవుతున్నడు. ప్రస్తుతం హిట్ కోసం రవితేజ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు.ఎన్నో విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ విజయం సాధించలేక పోతున్నాడు రవి తేజ. 

 

 

 

 ముఖ్యంగా మొన్న సైన్స్ ఫిక్షన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కో రాజా సినిమా.. కథ కథాంశం పరంగా అంత బాగున్నప్పటికీ రవితేజ నటన అదరగొట్టినపటికి ఎక్కడో తేడా కొట్టేసి ఈ సినిమా కూడా రవితేజకు నిరాశనే మిగిల్చింది. దీంతో మాస్ మహారాజా రవితేజ తన రూటు మార్చుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మాస్ యాక్షన్ స్టోరీలను పక్కన పెట్టేసి మంచి కామెడీ కంటెంట్ మూవీలను తియ్యాలని... ప్రస్తుతం అలాంటి కంటెంట్ ఉన్న మూవీలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని... నిర్ణయానికి వచ్చారట మాస్ మహారాజా రవితేజ. అయితే ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు క్రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

 

 

 అయితే ఈ సినిమాలో ఫుల్ కామెడీ దంచికొట్టేలా  జాగ్రత్తలు తీసుకుంటున్నారు మాస్ మహారాజా రవితేజ. ఇక ఈ సినిమా తర్వాత మాస్ యాక్షన్ కు కాస్త బ్రేక్ ఇచ్చి ఫుల్ కామెడీ స్క్రిప్ట్ లని ఓకే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత త్రినాధ్ నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు రవితేజ. అయితే ఆ సినిమా ఫుల్ కామెడీ బేస్  స్క్రిప్ట్ అని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇలా తన పంథా మార్చుకుని రవితేజకు ఎలాగైనా మంచి హిట్ లభించి అంతకుముందు ఫామ్ లోకి వచ్చి దూసుకుపోతాడ అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: