సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన జాను ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. తమిళ్ సినిమా 96కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. జాను సినిమా రిలీజ్ రోజున క్రిటిక్స్ నుండి, ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ టాక్ వచ్చాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం జాను సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. 
 
జాను సినిమా నిర్మాత దిల్ రాజుకు 60 శాతం వరకు నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జాను సినిమా డిజాస్టర్ కావడానికి అసలు కారణం ఈ సినిమా విడుదలవక ముందే చాలా మంది తమిళ్ వెర్షన్ చూసి ఉండటమే. జాను సినిమా ఫలితం తరువాత టాలీవుడ్ నిర్మాతలు రీమేక్ పేరు చెబితే భయపడుతున్నారు. తాజాగా జాను సినిమా ఫలితం ప్రభావం రామ్ నటిస్తున్న తడమ్ రీమేక్ రెడ్ పై పడినట్టు తెలుస్తోంది. 
 
తడమ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఒక ట్విస్ట్ సినిమా హిట్ కావడానికి ప్రధాన కారణం. 96 సినిమాలా తడమ్ ను కూడా ప్రేక్షకులు సినిమా విడుదలకు ముందే చూసేస్తే మాత్రం రెడ్ కలెక్షన్లపై ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. రెడ్ సినిమా మేకర్లు ఈ సినిమా రీమేక్ అని చెప్పుకోవటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఇదేదో కొత్త సినిమా అనే విధంగానే ప్రచారం చేస్తున్నారు. 
 
సమంతలాంటి హీరోయిన్ అద్భుతంగా నటించిన జాను సినిమానే ఫ్లాప్ కావడంతో రామ్ మరియు చిత్ర యూనిట్ రీమేక్ చేసి తప్పు చేశామా...? అని సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సమంత నటించిన జాను ఫలితం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రామ్ ను భయపెడుతూనే ఉంది. ఇప్పటికే విడుదలైన రెడ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: