అక్కినేని వారసుడి సుశాంత్ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా `చి ల సౌ`. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ రుహానీ శర్మ. తొలి సినిమాలోనే అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకున్నా ఈ భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దాదాపు ఏడాది గ్యాప్‌ తరువాత నాని నిర్మించిన హిట్ సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది రుహాని. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ కు జోడిగా నటించింది ఈ భామ.

 

ఒక్క హిట్ మాత్రమే ఉన్న రుహాని కెరీర్‌లో నిలదొక్కుకునే వరకు రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేయకుండా ఇంట్రస్టింగ్ సినిమాల్లో నటిస్తే బెటర్‌ అంటున్నారు విశ్లేషకులు. కానీ ఈ భామ ఆలోచన మాత్రం మరోలా ఉంది. ఇప్పుడే తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు భారీ డిమాండ్‌లు పెడుతుందట. దీంతో రెండో సినిమాకే నిర్మాతలు రుహాని పేరు చెపితేనే భయపడే పరిస్థితి వచ్చిందన్న టాక్‌ వినిపిస్తోంది.

 

ఇటీవల ఒకరిద్దరు నిర్మాతలు రుహాని తమ సినిమాల కోసం సంప్రదిస్తే ఆ భామ అడిగిన రెమ్యూనరేషన్‌ విని షాక్‌ తిన్నారట. హిట్ సినిమా ఫలితం ఇంకా డిసైడే కాలేదు. తొలి సినిమా పెద్ద  కమర్షియల్ హిట్ కూడా కాదు. అయినా ఈ భామ అంత మొత్తం డిమాండ్‌ చేయటంతో దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట. అయితే సినిమాల్లో అవకాశాల సంగతి ఎలా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం ఈ భామ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్‌ ఫోటోలతో అభిమానులను ఊరిస్తోంది రుహాని.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ruhani Sharma (@ruhanisharma94) on

మరింత సమాచారం తెలుసుకోండి: