దాదాపు మూడు సంవత్సరాల నుండి ధనుష్ తమ కొడుకేనని నిరూపించుకోవడానికి కదిరేషన్, meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి దంపతులు కోర్టులో పోరాడుతున్న విషయం తెలిసిందే. చిన్నప్పుడు తప్పిపోయిన తమ బిడ్డే పెద్దై హీరో అయ్యాడని వృద్ధ జంట 2017 సంవత్సరం నుండి న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగా మధురై కోర్టు ఈ కేసు విషయంలో ధనుష్ కు షాక్ ఇచ్చింది. ధనుష్ బర్త్, ఎడ్యుకేషన్, ఇతర సర్టిఫికెట్లు ఎక్కడున్నాయని కోర్టు ప్రశ్నించింది. 
 
చెన్నై కార్పొరేషన్ ధనుష్ కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను న్యాయస్థానంలో పొందుపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధనుష్ ఈ వివాదంలో బర్త్ సర్టిఫికెట్ ను ఇప్పటివరకు ఎందుకు సబ్మిట్ చేయలేదని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కదిరేషన్ దంపతులు మాత్రం తమ బిడ్డ తామెవరో తెలియదని ఎందుకు చెబుతున్నాడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
కోర్టుకు డీ.ఎన్.ఏ టెస్టులు చేస్తే ధనుష్ తమ కొడుకో కాదో తెలుస్తుందని.. ఈ కేసులో అసలు నిజాలు టెస్టుల తరువాత బయటికొస్తాయని తెలిపారు. 2017 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కదిరేషన్ దంపతులు ధనుష్ తమ కొడుకేనని నెలకు 65 వేల రూపాయల భృతి తమకు ఇచ్చేలా చేయాలని కోర్టును ఆశ్రయించారు. అందుకు సాక్ష్యంగా పదో తరగతి సర్టిఫికెట్లను వృద్ధ జంట దాఖలు చేసింది. 
 
ఆ తరువాత మధురై మెడికల్ కాలేజీని పుట్టుమచ్చలు చెక్ చేయమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధురై మెడికల్ కాలేజీ పుట్టుమచ్చలు లేవని నివేదిక ఇచ్చింది. అనంతరం ధనుష్ పుట్టుమచ్చలు చెరిపించుకున్నాడనే విషయం బయటికొచ్చింది. ధనుష్ సినిమాల కోసమే పుట్టుమచ్చలు చెరిపించుకున్నానని స్పష్టత ఇచ్చారు. తాజాగా కోర్టు బర్త్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేయటంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: