మెగా ఫ్యాన్స్ కు ఒకటి కాదు.. రెండు కాదు అన్నీ శుభవార్తలే. రెండేళ్ల విరామం తర్వాత పవన్ నటిస్తున్న సినిమా అప్ డేట్స్ వచ్చేశాయి. నిర్మాతలు అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోయినా.. టైటిల్ ఫస్ట్ లుక్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలిసిపోయింది.

 

హిందీ సినిమా పింక్ తెలుగు రీమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా ఆద్యంతం పవన్ కనిపించకపోయినా.. అమితాబ్ పోషించిన ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు పవన్. తెలుగు నేటివిటీ.. పవన్ ఇమేజ్ కు తగ్గట్టు హీరోకు సీన్స్ పెంచారని తెలిసింది. ప్రస్తుతం పవన్, ప్రకాశ్ రాజ్ పై సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఎంసీఏ తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మి,స్తున్నాడు. 

 

పవన్ ఇందులో లాయర్ గా కనిపించడంతో.. సినిమాకు వకీల్ సాబ్.. లాయర్ సాబ్.. అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను మార్చి 2న ఎనౌన్స్ చేస్తారని తెలిసింది. ఇక ఫస్ట్ సాంగ్ ను ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న రిలీజ్ చేస్తారు. ఫస్ట్ టైమ్ తమన్ పవన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. 

 

సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో అయినా ఆడవారి సమస్యల చుట్టూ సినిమా తిరుగుతోంది. ఈ క్రమంలో అంజలి.. నివేద థామస్.. అనన్య నాగళ్ల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాను సమ్మర్ స్పెషల్ గా మే 15న రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలను.. అటు సినిమాలను బ్యాలెన్స్ గా చేసుకుంటూ పోతున్నారు. రెండు రంగాలకు సమన్యాయం చేస్తున్నారు. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇటు అభిమానులను కొత్త సినిమాలతో ఊరిస్తూ వారిలో ఉత్తేజం నింపుతున్నారు. చూడాలి పింక్ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: